ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం కల్పించాలి
ABN , Publish Date - Jul 02 , 2025 | 12:31 AM
ప్రభు త్వ వైద్యంపై ప్రజలలో నమ్మకం కల్పించాలని, మంథని ప్రాంతంలో వైద్య సేవలు మెరుగు పడాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అమలుపై వైద్యాధి కారులతో సమావేశం నిర్వహించారు.
పెద్దపల్లిటౌన్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ప్రభు త్వ వైద్యంపై ప్రజలలో నమ్మకం కల్పించాలని, మంథని ప్రాంతంలో వైద్య సేవలు మెరుగు పడాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అమలుపై వైద్యాధి కారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మంథని కమ్యూనిటీ హెల్త్ సెం టర్‌లో మొత్తం 14 మంది వైద్య సిబ్బంది ఉన్న ప్పటికీ ప్రజల నుంచి వైద్యులు అందుబాటులో ఉండటం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని, బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం, సీసీ కెవె ురాలు ఏర్పాటు చేయాలన్నారు. మంథని ఆసు పత్రి నుంచి అధికంగా రిఫరల్ కేసులు రాకుం డా చూడాలని, అత్యవసర క్రిటికల్ కేసులను మాత్రమే పెద్దపల్లి, గోదావరిఖని రిఫర్ చేయా లని సూచించారు. మంథని ఎంసీహెచ్ ఆసు పత్రిలో నెలకు 25 ప్రసవాలు జరిగేలా చూడా లన్నారు. ప్రాథమిక ఆరోగ్య సబ్ సెంటర్ల వారీగా గర్భిణీలను ట్రాక్ చేస్తూ ప్రసవం కోసం మంథని ఎంసీహెచ్‌కు వచ్చేలా చూడాలని సూచించారు. నవజాత శిశువుల సంరక్షణకు అవసరమైన వార్మర్, ఇతర పరికరాల ఏర్పా టుకు చర్యలు తీసుకోవాలని, సీహెచ్‌సీ మం థనిలో ఔట్ పేషెంట్ సేవలు పెరగాలన్నారు. వైద్యులు సకాలంలో విధులకు హాజరు కావా లని, వైద్యులు, సిబ్బంది సెలవుల మంజూరు ప్రణాళిక ప్రకారం జారీ చేయాలని, ఈ నెలలో స్పష్టమైన మార్పు చూపించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్న ప్రస న్నకుమారి, డిసిహెచ్‌ఓ డాక్టర్ శ్రీధర్, అధికారులు పాల్గొన్నారు.
తాగు నీటి పనులను పూర్తి చేయాలి
జిల్లాలో తాగు నీటి ఇంట్రా పనులను త్వరి తగతిన పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్‌లో మిషన్ భగీరథ ఇంట్రా తాగునీటి సరఫరాపై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. అంతర్గాం, పాలకుర్తి, మంథని, కమాన్‌పూర్, ముత్తారం, రామగిరి మండలాల్లోని గ్రామాల్లో పెండింగ్ ఉన్న ఇంట్రా మిషన్ భగీరథ పనులకు సంబం ధించి చేపట్టిన పనుల పురోగతి వివరాలను సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఫిబ్ర వరి నెలలో మంజూరు చేసిన ఇంట్రా పనులు ఇంకా పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వారం రోజులలో ఇండ్లకు పైప్ లైన్ ద్వారా తాగు నీరు చేరేలా చూడాలన్నారు. పను లు త్వరగా అయ్యేలా ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశిం చారు. మంథని ప్రాంతంలో తాగునీటి సరఫ రాలో ఉన్న ఇబ్బందుల గురించి గ్రామాల వారీ గా నివేదిక తయారు చేయాలని కలెక్టర్ ఆదేశిం చారు. పెద్దపెల్లి జిల్లాలో మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా కాకుండా పాత గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థల ద్వారా ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల జాబితా తయారు చేసి వాటి పునరు ద్ధరణ అవకాశాలపై రిపోర్ట్ అందించాలన్నారు.