Share News

సీజనల్‌ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Jul 25 , 2025 | 11:24 PM

సీజనల్‌ వ్యాదులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్‌ కమిషనర్‌ ఆకుల వెంకటేష్‌ సూచించారు. శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్‌ వార్డ్‌ ఆఫీసర్లు, మెప్మా సిబ్బంది ఆశా వర్కర్లతో ప్రతి వార్డులో ఇంటి యజమానులకు అవగాహన కల్పించారు

సీజనల్‌ వ్యాధులపై  ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

పెద్దపల్లిటౌన్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): సీజనల్‌ వ్యాదులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్‌ కమిషనర్‌ ఆకుల వెంకటేష్‌ సూచించారు. శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్‌ వార్డ్‌ ఆఫీసర్లు, మెప్మా సిబ్బంది ఆశా వర్కర్లతో ప్రతి వార్డులో ఇంటి యజమానులకు అవగాహన కల్పించారు కమిషనర్‌ మాట్లాడుతూ మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న దృష్ట్యా వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, పాత టైర్లు, టబ్బులు, కొబ్బరి బొండాలు, కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. నిల్వ నీటిలో దోమలు వృద్ధి చెందుతాయని, వాటివల్ల మలేరియా, డెంగ్యూ వంటి విషజ్వరాలు సోకుతాయన్నారు.

అన్ని వార్డులో వార్డ్‌ ఆఫీసర్‌, ఆర్పీ, ఆశ వర్కర్‌, అంగన్వాడి కార్యకర్తల సమన్వయంతో అవగాహన నిర్వహిస్తున్నారన్నారు. కూరగాయల మార్కెట్‌ యజమానులు, మటన్‌, చికెన్‌ వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చెత్తను రోడ్లపై, మురికాలువల్లో వేయకుండా మున్సిపల్‌ సిబ్బందికి అందచేయాలన్నారు. వార్డ్‌ ఆఫీసర్లు, సానిటరీ ఇన్స్పెక్టర్లు, మున్సిపల్‌ సిబ్బంది, ఆశా వర్కర్లు మెప్మా ఆర్పీలు పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2025 | 11:24 PM