ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Sep 22 , 2025 | 11:49 PM
ప్రజలకు సైబర్ నేరాలపై వారియర్స్ అవగాహన కల్పించాలని రామ గుండం సీపీ అంబర్‌కిశోర్ ఝా సూచించారు. సోమవారం కమిషనరేట్‌లో సైబర్ వారియర్స్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
కోల్‌సిటీ, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు సైబర్ నేరాలపై వారియర్స్ అవగాహన కల్పించాలని రామ గుండం సీపీ అంబర్‌కిశోర్ ఝా సూచించారు. సోమవారం కమిషనరేట్‌లో సైబర్ వారియర్స్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్న క్రమంలో సైబర్ క్రైమ్ సెక్యూరిటీపై అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యమని, ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో అవగాహన కల్పించి చైత న్యం తీసుకురావాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం లేకుండా విచారణ నిర్వహించి సైబర్ బాధితులకు న్యాయం చేసే విధంగా కృషి చేయాలని, రామగుండం కమిషనరేట్ పరిధిలో ఇటీవల నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 134 సైబర్ కేసుల్లో రూ.41.81లక్షలను బాధితు లకు ఇప్పించామన్నారు. కేసులను చేధించి రిఫండ్ అయ్యేలా కృషి చేసిన నలుగురు సైబర్ వారియర్ పోలీస్ కానిస్టేబుళ్లకు ప్రశంసాపత్రాలతో టీజీసీఎస్‌బీ హైదరాబాద్ వారు పంపించిన టీ షర్టులను అందజేశారు. సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, సీసీపీఎస్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి, సీసీ హరీష్, సైబర్ వారియర్స్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పండుగలకు కట్టుదిట్టమైన భద్రత
రామగుండం పోలీస్ కమిషన రేట్ పరిధిలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లలో బతుకమ్మ, దుర్గామాత నవ రాత్రి ఉత్సవాలకు కట్టుదిట్టమైన భద్ర తను ఏర్పాటు చేసినట్టు సీపీ అంబర్ కిశోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. దుర్గామాత ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో పెట్రోలింగ్, విజుబుల్ పోలీసింగ్ నిర్వ హిస్తూ భద్రత కల్పిస్తామని, మహిళ లపై వేధింపులు, ఈవ్‌టీజింగ్‌లకు పా ల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సద్దుల బతుకమ్మ రోజు అవాంఛనీయ సంఘటనలు జరుగ కుండా చర్యలు చేపట్టనున్నట్టు పేర్కొ న్నారు. దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో నిర్వాహకులు నిబంధనలు పాటించా లని, వేడుకల సమయంలో శాంతిభధ్ర తలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హె చ్చరించారు. సెలవుల్లో ఊరికివెళితే పోలీ స్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సూచించారు.