లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Aug 29 , 2025 | 12:28 AM
వర్షాలు, వరదల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచిం చారు. గురువారం మంథని శివారులోని గోదావరి నది పుష్కరఘాట్‌ను సందర్శించిన వరద ఉధృతిని పరిశీలిం చారు.
మంథని/మంథనిరూరల్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): వర్షాలు, వరదల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచిం చారు. గురువారం మంథని శివారులోని గోదావరి నది పుష్కరఘాట్‌ను సందర్శించిన వరద ఉధృతిని పరిశీలిం చారు. ఆయన మాట్లాడుతూ.. వివిధ ప్రాజెక్టుల నుంచి విడుదల చేస్తున్న వరదను ఎప్పటికప్పడు పరిశీలిస్తూ అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిం చాలని ఆదేశించారు. మున్సిపల్ భవన నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. పట్ట ణంలో అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణాలు జరిగిన వెంటనే కూల్చి వేయాలన్నారు. పారిశుధ్య నిర్వహణపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అడవిసోమన్‌పల్లిలో ఇం దిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. చివరి దశలోఉన్న ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసి ప్రారం భోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. చెక్ పోస్టు వద్ద 24 గంటల అప్రమత్తంగా ఉండి అక్రమ యూరి యా రవాణాను అరికట్టాలన్నారు. ఎక్లాస్‌పూర్‌లో మున్సి పాలిటీకి సంబంధించి డంపింగ్ యార్డు స్థలాన్ని పరి శీలించారు. ఆర్డీవో సురేష్, ఎంపీడీవో శశికళ, తహసీ ల్దార్ కుమారస్వామి, కమిషనర్ వెంకన్నలు ఉన్నారు.
పొంగి ప్రవహిస్తున్న హుస్సేనిమియా వాగు
జూలపల్లి, (ఆంధ్రజ్యోతి): ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వడుకాపూర్ శివారులో గల హుస్సేనిమియా వాగు రోడ్‌డ్యాంపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడం తో రాకపోకలు నిలిచిపోయాయి. కూలీలు, రైతులు, ప్రయాణికులు వాగు దాటలేక వెనుదిరిగారు. ఎస్‌ఐ సనత్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు వాగు ప్రవాహం వద్ద భద్రత చర్యలు చేపట్టారు. ప్రజలు వాగును దాటకుండా రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్‌ను నిలిపారు.
ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి
సుల్తానాబాద్, (ఆంధ్రజ్యోతి): మానేరు డ్యామ్ గేట్లను ఎత్తివేసే అవకాశాలున్నందున ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గురువారం రాత్రి లేదా శుక్రవారం ఎత్తివేసే అవకాశాలు న్నాయని, పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని, రైతులు మానేరు వైపు వెళ్లవద్దని తహసీల్దార్ బషీరొద్దిన్, ఎంపీడీఓ దివ్యదర్శన్ రావు, ఎస్‌ఐ శ్రావణ్ కుమార్ తెలిపారు. మానేరు పరివాహక ప్రాంత గ్రామాలను ఎస్‌ఐ సందర్శించారు.