పెన్షన్ బిక్ష కాదు.. ఉద్యోగుల హక్కు
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:28 AM
పెన్షన్ బిక్ష కాదు హక్కు అని ఉపాధ్యాయ, ఉద్యోగులు సోమవారం పెన్షన్ విద్రోహ దినం పాటించారు. తారుపల్లి ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. సీపీఎస్ రద్దు చేయాలని, పాత పెన్షన్‌ను వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.
కాల్వశ్రీరాంపూర్, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): పెన్షన్ బిక్ష కాదు హక్కు అని ఉపాధ్యాయ, ఉద్యోగులు సోమవారం పెన్షన్ విద్రోహ దినం పాటించారు. తారుపల్లి ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. సీపీఎస్ రద్దు చేయాలని, పాత పెన్షన్‌ను వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. 30 ఏళ్ల పైబడి ఉద్యోగం చేసిన వ్యక్తికి పెన్షన్ లేకపోవడం సరికాదన్నారు. పదేళ్లు ఎమ్మెల్యేగా, ఎంపీలుగా గెలిస్తే జీవితాంతం రెండు పెన్షన్లు తీసుకోవడం, వారి పెన్షన్లు కూడా 200 శాతం వరకు పెంచుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానోపాధ్యాయులు శ్యాంసుందర్ రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రమాదేవి, ఆగయ్య, ఎల్లయ్య, సత్యప్రకాష్ రావు, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.
ముత్తారం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు జూనియర్ కళాశాలల్లో సీపీఎస్ రద్దు చేయాలని అధికారులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఓపీఎస్‌ను పునఃరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. ఎంపీడీవో సురేష్, సిబ్బంది, జూనియర్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ జిఎల్‌ఎన్ రావు పాల్గొన్నారు.
మంథనిరూరల్, (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ, ఉపాధ్యాయులు భోజన విరా మ సమయంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉద్యోగులు నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ కొనసాగించాలని డిమాండ్ చేశారు. మినిస్టీరియల్ సంఘం జిల్లా అధ్యక్షు డు రంగు రవి, ఎంపీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు వెన్నపురెడ్డి అనిల్ రెడ్డి, ఎంపీడీవోశశికళ, ఉద్యోగులు సురేష్, నాగరాజు, ప్రసాద్ పాల్గొన్నారు.
పాలకుర్తి, (ఆంధ్రజ్యోతి): సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హజర య్యారు. సంక్షేమ పథకాల అమలుకు క్షేత్ర స్థాయిలో నిర్విరామంగా కృషి చేస్తున్న తమకు జీపిఎఫ్ విధానాన్ని అమలు చేయాలని వారు కోరారు. ఎంపీవో ఉప్పు సుధర్శన్,సీనియర్ అసిస్టెంట్ దాడి శ్రీనివాస్ పాల్గొన్నారు.