Share News

పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Nov 21 , 2025 | 11:35 PM

పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ హెచ్‌ఎంఎస్‌ ఆధ్వర్యంలో సింగరేణి భవన్‌ ముట్టడికి వెళ్ళిన నాయ కులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవా రం ఓసీపీ-3 ఎస్‌అండ్‌డీ సెక్షన్‌లో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.

పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి

యైుటింక్లయిన్‌కాలనీ, నవంబరు 21 (ఆంధ్ర జ్యోతి): పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ హెచ్‌ఎంఎస్‌ ఆధ్వర్యంలో సింగరేణి భవన్‌ ముట్టడికి వెళ్ళిన నాయ కులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవా రం ఓసీపీ-3 ఎస్‌అండ్‌డీ సెక్షన్‌లో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. యూని యన్‌ అధ్యక్షుడు రియాజ్‌ అహ్మద్‌ మాట్లా డారు. గుర్తింపు, ప్రాతినధ్య సంఘాలు సమ స్యలు పరిష్కరించడంలో విఫలమైనట్టు ఆరో పించారు. ఒక్క గని ప్రారంభించలేని చేతగాని స్థితిలో రెండు సంఘాలు ఉన్నాయని, మెడికల్‌ బోర్డు రద్దు చేసే కుట్ర జరుగుతున్న విషయం తెలిసినా సంఘాలు యాజమాన్యం మీద ఒత్తిడి తేవడంలేదన్నారు. 150, 200 మస్టర్ల నిబంధనపై ఒక్క మాట మాట్లాడకుండా యాజమాన్యానికి సహకరిస్తూ కార్మికులకు అన్యాయం చేశాయని ఆరోపించారు. పెర్క్స్‌పై ఐటీని రీయింబర్స్‌, సొంత ఇంటి పథకం అమలు చేయిస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయో గెలిచిన సంఘాలు కార్మికులకు సమాధానం చెప్పాలని రియాజ్‌ అహ్మద్‌ డిమాండ్‌ చేశారు. కార్మికుల కష్టార్జితాన్ని ప్రభుత్వం దారి మళ్ళిస్తున్నా, విద్యుత్‌ సంస్థల నుండి బకాయిలపై గెలిచిన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీలు ఎం దుకు స్పందించడంలేదో కార్మికులు ఆలోచించాలని రియాజ్‌ కోరారు. డిమాం డ్లపై యాజమాన్యాన్ని ప్రశ్నించేందుకు వెళ్ళిన హెచ్‌ఎంఎస్‌ నాయకు లను పోలీసులతో అరెస్టు చేయించడం కార్మికుల గొంతునొక్కడమే అని, ఇప్పటికైనా గెలిచిన సంఘాల నిజస్వరూపాన్ని కార్మికవర్గం అర్థం చేసుకోవాలని కోరారు. నిరసనలో ఆర్జీ-2 వైస్‌ ప్రెసిడెంట్‌ దావు రమేష్‌, నాయకులు రత్నాకర్‌రెడ్డి, నవీన్‌, నరేష్‌, సురేష్‌, పాష పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2025 | 11:35 PM