ప్రశాంతంగా పాలిసెట్
ABN , Publish Date - May 13 , 2025 | 11:40 PM
జిల్లా కేంద్రంలో మంగళవారం పాలిసెట్ ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 2488మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 2366మంది విద్యార్థులు హాజరు కాగా 122మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.
పెద్దపల్లి కల్చరల్, మే 13 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో మంగళవారం పాలిసెట్ ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 2488మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 2366మంది విద్యార్థులు హాజరు కాగా 122మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 1336 మంది బాలురకు 1275 మంది, బాలికలు 1091 మందికిగాను 61మంది గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 95 శాతం విద్యార్థులు హాజరయ్యారు. పరీ క్ష కేంద్రాలను పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్ లక్ష్మీ నర్సయ్య పరిశీలించారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు.