ప్రశాంతంగా అర్బన్ బ్యాంకు ఎన్నికలు
ABN , Publish Date - Nov 02 , 2025 | 12:33 AM
కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు పాలకవర్గ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కరీంనగర్, జగిత్యాలలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా సాధారణ ఎన్నికల తరహాలో ఉదయం 7 గంటల నుంచే బ్యాంకు సభ్యులు (ఓటర్లు) తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు.
కరీంనగర్ టౌన్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు పాలకవర్గ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కరీంనగర్, జగిత్యాలలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా సాధారణ ఎన్నికల తరహాలో ఉదయం 7 గంటల నుంచే బ్యాంకు సభ్యులు (ఓటర్లు) తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. 12 డైరెక్టర్లలో ఎస్సీ, ఎస్టీకి ఒకటి, మహిళలకు రెండు, జనరల్‌కు తొమ్మిది స్థానాలను రిజర్వు చేశారు. 12 మంది డైరెక్టర్లతో కూడిన పాలకవర్గ ఎన్నికలకు 54 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఒక్కో ఓటరు 12 ఓట్లు వినియోగించుకోవచ్చు. తాజా మాజీ చైర్మన్ గడ్డం విలాసరెడ్డి, మరో మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జి వెలి చాల రాజేందర్‌రావు మద్దతు మరో ప్యానల్ మొత్తం మూడు ప్యానల్స్‌లో 36 మంది, 18 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు.