Share News

బకాయిల చెల్లింపులు వేగవంతం చేయాలి

ABN , Publish Date - Nov 02 , 2025 | 11:24 PM

రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌ బకాయిల వెంటనే చెల్లించాలని ఎస్‌టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఆట సదయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఐఎంఏ భవన్‌లో జిల్లా శాఖ అధ్యక్షుడు మేరుగు సతీష్‌ అధ్యక్షతన జరిగిన జిల్లా కౌన్సిల్‌ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

బకాయిల చెల్లింపులు వేగవంతం చేయాలి

పెద్దపల్లి కల్చరల్‌, నవంబరు2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌ బకాయిల వెంటనే చెల్లించాలని ఎస్‌టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఆట సదయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఐఎంఏ భవన్‌లో జిల్లా శాఖ అధ్యక్షుడు మేరుగు సతీష్‌ అధ్యక్షతన జరిగిన జిల్లా కౌన్సిల్‌ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పెండింగ్‌ బిల్లులు వేగవంతం చేయాలన్నారు. సంఘాల ప్రాతినిధ్యం మేరకు ప్రతీ నెల 700 కోట్ల బకాయిల చెల్లింపు సంతోషమే అయినా, బకాయిలు పెద్దమొత్తంలో ఉన్నాయని, అవి సరిపోవడం లేదన్నారు. కనీసం రూ.2 వేల కోట్లు ప్రతీ నెల చెల్లించాలని కోరారు. రిటైర్డ్‌ ఉపాధ్యాయులకు వెంటనే క్లియర్‌ చేయాలన్నారు. డీఏ బకాయిలు, సీపీఎస్‌ ఉపాధ్యాయులకు వాయిదాల రూపంలో చెల్లించడం సరికాదన్నారు. అనంతరం ఎస్‌టీయూ జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా నడిపెల్లి సంతోష్‌ కుమార్‌, ప్రధాన కార్యదర్శిగా మేరుగు సతీష్‌, ఆర్థిక కార్యదర్శిగా మాధవాచారి, రాష్ట్ర కమిటీ సభ్యులుగా మందల శ్రీకాంత్‌రెడ్డి, అసోసియేట్‌ అధ్యక్షుడిగా బోగె చంద్రశేఖర్‌, సయ్యద్‌ ఫయాజుద్దీన్‌, ఉపాధ్యక్షుడిగా శేషాద్రి, అదనపు జనరల్‌ సెక్రటరీలుగా తోటరాజు, కిన్నెర శ్రీనివాస్‌, కార్యదర్శులుగా బడుగు నగేష్‌, శ్రవణ్‌ కుమార్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీని పలు మండలాల అధ్యక్ష, కార్యదర్శులు అభినందించారు.

Updated Date - Nov 02 , 2025 | 11:24 PM