పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టండి
ABN , Publish Date - May 31 , 2025 | 11:41 PM
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, జూన్ 2 నుంచి చేపట్టనున్న వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతంగా అమలు చేయాలని కార్పొరేషన్ కమిషనర్, అదనపు కలె క్టర్ అరుణశ్రీ పేర్కొన్నారు.
కోల్‌సిటీ, మే 31(ఆంధ్రజ్యోతి): పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, జూన్ 2 నుంచి చేపట్టనున్న వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతంగా అమలు చేయాలని కార్పొరేషన్ కమిషనర్, అదనపు కలె క్టర్ అరుణశ్రీ పేర్కొన్నారు. శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులు, సిబ్బందికి యాక్షన్‌ప్లాన్‌పై అవగాహన కల్పించారు. వర్షాకా లంలో వరదలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పారిశుధ్య అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతీ ఇంటి నుంచి చెత్త సేకరించాలని, ప్రజా మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచడం, శుక్రవారం డ్రైడే చేపట్టడం, చెత్త నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి శుభ్రం చేయాలన్నారు.
నాలాల్లో పూడికతీతతోపాటు మొక్కలు నాటాలన్నారు. శిథిలావస్థలో ఉన్న కట్టడా లను, భవనాలను తొలగించేలా కార్యాచరణ అమలు చేయాలన్నారు. కార్పొ రేషన్ ఆదాయం పెంపొందించడంలో భాగంగా అండర్ అసెస్‌మెంట్, అన్ అసెస్‌మెంట్, వాణిజ్య ఆస్తులను గుర్తించి పన్నులను సవరించాలని, ట్రేడ్ లైసెన్స్‌లు జారీ చేయాలన్నారు. కొత్త స్వశక్తి సంఘాలను ఏర్పాటు, బ్యాంకు లింకేజీ, వీధి వ్యాపారులకు రుణాలు, వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయాల న్నారు. డివిజన్లలో జరిగే కార్యక్రమాల్లో వార్డు అధికారులు భాగస్వామ్యులు కావాలన్నారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎస్‌ఈ శివానంద్, ఈఈ రామన్, డీఈఈలు హనుమంతనాయక్, షాబాజ్, జమీల్, ఆంజనేయులు, టీపీఓ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, మెప్మా డీఎంసీ మౌనిక, సిబ్బంది పాల్గొన్నారు.