Share News

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

ABN , Publish Date - Nov 30 , 2025 | 12:33 AM

ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష వైద్యులకు, వైద్య సిబ్బందికి సూచించారు. శనివారం గోదావరిఖని ప్రభు త్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

కళ్యాణ్‌నగర్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష వైద్యులకు, వైద్య సిబ్బందికి సూచించారు. శనివారం గోదావరిఖని ప్రభు త్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో నిర్మాణం పూర్తి చేసుకున్న క్రిటికల్‌ కేర్‌ భవనం, ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్‌, బ్లడ్‌ బ్యాంక్‌, సదరమ్‌ బ్లాక్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లా డుతూ రోగులతో మర్యాదగా వ్యవహరించాలని, వారికి మెరుగైన వైద్యం అందించాలని, డిసెంబర్‌ 31నాటికి జనరల్‌ ఆసుపత్రిలోని ఓల్డ్‌ బిల్డింగ్‌లో మరమ్మతు పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

క్రిటికల్‌ కేర్‌ భవనంలో అవరమైన పరికరాలను త్వరిగతిన తీసుకువచ్చి సేవలను ప్రారంభించాలన్నారు. ఆసుపత్రి పాత భవనం వెనుక సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, ఆసుపత్రి చుట్టూ ఉన్న కాంపౌండ్‌ వాల్‌ ఎత్తు పెంచాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్‌ అరుణశ్రీ, ఆసు పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్‌ అరుణ, ఆర్‌ఎంఓలు కృపాభాయ్‌, టీఎస్‌ఎంఐడీసీ అధికారులు ఉన్నారు.

Updated Date - Nov 30 , 2025 | 12:33 AM