రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
ABN , Publish Date - Nov 18 , 2025 | 11:30 PM
రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ వైద్యులకు సూచించారు. మంగళవారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి సందర్శించారు.
కళ్యాణ్‌నగర్, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ వైద్యులకు సూచించారు. మంగళవారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి సందర్శించారు. వార్డుల ఆధునికీకరణ, అత్యవసర సేవల విస్తరణ, పరిశుభ్రత, పర్యావరణ నిర్వహణపై సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రోగులతో వైద్య సిబ్బంది మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. రోగులకు అవసరమయ్యే అత్యాధునిక పరికరాలు, సిబ్బంది నియామకం, అత్యవసర సేవలను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
సిమ్స్ మెడికల్ కళాశాలకు అనుబంధంగా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పడకల స్థాయిని 732కు పెంచామని, త్వరలోనే సింగరేణి ఆసుపత్రిలో క్యాత్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేసి గుండె వ్యాధి నిపుణులను అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్టు ఆయన చెప్పారు. సిమ్స్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ నరేందర్, సూపరింటెండెంట్ దయాల్, ఆర్‌ఎంఓలు దెండె రాజు, కృపాభాయి, కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి, దూళికట్ట సతీష్, రహీం పాల్గొన్నారు.