పార్టీ పటిష్టానికి కృషి చేయాలి
ABN , Publish Date - Feb 26 , 2025 | 12:25 AM
కలిసికట్టుగా ముందుకు సాగి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. మంగళవారం మార్కండేయకాలనీలో బీఆర్‌ఎస్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వ హించారు.

గోదావరిఖని, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): కలిసికట్టుగా ముందుకు సాగి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. మంగళవారం మార్కండేయకాలనీలో బీఆర్‌ఎస్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వ హించారు. చందర్ మాట్లాడుతూ అబద్దాల హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిం దన్నారు. రాబోయే రోజులు మనవేనని, గులాబీ శ్రేణులు వ్యూహాత్మకంగా ముందుకు సాగాలన్నారు. సంక్షేమ పథ కాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైం దన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. నాయ కులు మూల విజయరెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ అభిషేక్‌రావు, మాజీ జెడ్‌పీటీసీ అముల నారాయణ, మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
బీఎస్పీ అభ్యర్థులను గెలిపించాలి
ఎలిగేడు, ఫిబ్రవరి 25(ఆంఽధ్రజ్యోతి): బీఎస్పీ బలపరి చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్నహరికృష్ణగౌడ్, టీచర్స్ అభ్యర్థి సాయన్న ముదిరాజ్‌లను గెలిపించాలని బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాబు కోరారు. మంగళ వారం శివపల్లి, నర్సాపూర్, లాలపల్లి, సుల్తాన్‌పూర్, ఎలిగేడు గ్రామాలలో ప్రచారం నిర్వహించారు.