ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం కలిగించాలి
ABN , Publish Date - Jun 06 , 2025 | 12:27 AM
ప్రభు త్వ పాఠశాలల్లో అందే నాణ్యమైన విద్యపై తల్లిదండ్రు లకు నమ్మకం కలిగించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో బడిబాటపై సంబం ధిత అధికారులతో సమీక్ష నిర్వ హించారు. కలెక్టర్ మాట్లాడుతూ బడిబాట ద్వారా ఈనెల 6నుంచి జూన్ 19వరకు విద్యాసంస్థల్లో పిల్లలను చేర్పించే విధంగా చర్య లు తీసుకోవాలన్నారు.
పెద్దపల్లి కల్చరల్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): ప్రభు త్వ పాఠశాలల్లో అందే నాణ్యమైన విద్యపై తల్లిదండ్రు లకు నమ్మకం కలిగించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో బడిబాటపై సంబం ధిత అధికారులతో సమీక్ష నిర్వ హించారు. కలెక్టర్ మాట్లాడుతూ బడిబాట ద్వారా ఈనెల 6నుంచి జూన్ 19వరకు విద్యాసంస్థల్లో పిల్లలను చేర్పించే విధంగా చర్య లు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో బడి బాట కార్యక్రమం నిర్వహించాల న్నారు. గత సంవత్సరం బడి బాట కార్యక్రమం ద్వారా 2099 మంది విద్యార్థులు చేరారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మొదటి రోజే పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ చేసేందుకు అవసర మైన ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపారు. 3నుంచి 14 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు తప్పనిసరిగా అడ్మి షన్ తీసుకోవాలన్నారు. 15సంవత్సరాల వయస్సు ఉన్నవారిచే ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు రాసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలను భర్తీచేసిందని, అమ్మఆదర్శ పాఠశాల ద్వారా అవసరమైన మౌలిక వస్తువులు కల్పించామన్నారు. ఈనెల 12న జరిగే సమావేశంలో అమ్మఆదర్శ కమిటీ సభ్యులు, పిల్లల తల్లిదండ్రులు హాజరయ్యేలా చూడా లని అన్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు జిల్లా విద్యాశాఖ అధికారి డి.మా ధవి, జెడ్‌పీసీఓ నరేందర్, జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, జీసీడీవో కవిత, పాల్గొన్నారు.