Share News

తల్లిదండ్రుల పోషణ బాధ్యత పిల్లలదే

ABN , Publish Date - Nov 17 , 2025 | 11:52 PM

అరవై సంవ త్సరాలు పైబడిన వృద్ధ తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత పిల్లలదేనని మంథని సీనియర్‌ సివిల్‌ జడ్జి వీ. భవానీ స్పష్టంచేశారు. కోర్టు ప్రాంగణంలో మండల న్యాయ సేవా అధికార సమితి ఆధ్వర్యంలో సోమవారం వృద్ధుల సంక్షేమ చట్టం-2007పై అవగాహన సమావేశం లో జడ్జి భవానీ మాట్లాడారు.

తల్లిదండ్రుల   పోషణ బాధ్యత పిల్లలదే

మంథని, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): అరవై సంవ త్సరాలు పైబడిన వృద్ధ తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత పిల్లలదేనని మంథని సీనియర్‌ సివిల్‌ జడ్జి వీ. భవానీ స్పష్టంచేశారు. కోర్టు ప్రాంగణంలో మండల న్యాయ సేవా అధికార సమితి ఆధ్వర్యంలో సోమవారం వృద్ధుల సంక్షేమ చట్టం-2007పై అవగాహన సమావేశం లో జడ్జి భవానీ మాట్లాడారు. తల్లిదండ్రుల పోషణను విస్మరించే పిల్లలకు వారి ఆస్తి చెల్లదన్నారు. ముందే తల్లిదండ్రుల ఆస్తి పొంది ఉంటే తిరిగి యాజమాన్యపు హక్కులు తల్లిదండ్రులకు చెందే విధంగా చట్టంలో పొందుపరిచారన్నారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కేవీఎల్‌ఎన్‌ హరిబాబు మాట్లాడుతూ.. నిర్లక్ష్యానికి గురైన వృద్ధులు ఆర్డీవోకి ఫిర్యాదు చేయడం ద్వారా పోషణ బాధ్యత హక్కులు పొందవచ్చన్నారు. ఉపాధ్యక్షుడు కేతి రెడ్డి రఘోత్తంరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం. సయేంద ర్‌రెడ్డి, న్యాయవాది ఎస్‌. చంద్రశేఖర్‌, చంద్రుపట్ల సుధా కర్‌రెడ్డి, పోరెడ్డి వెంకట్‌రెడ్డి, సత్యనారాయణ, శ్రీనివాస్‌, శశిభూషన్‌కాచే, వ్యాస్‌ కుమార్‌లు పాల్గొన్నారు.

చట్టాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలి

ఎలిగేడు, నవంబరు17(ఆంధ్రజ్యోతి): చట్టాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని సుల్తానాబాద్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి దుర్గం గణేష్‌ అన్నారు. సోమ వారం ధూళికట్టలో మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత న్యాయ విజ్ఞాన సద స్సుకు ముఖ్యఅతిథిగా వచ్చి ప్రసంగించారు. న్యాయ విజ్ఞానసదస్సుల ద్వారా పాల్గొన్న జడ్జి, అతిథులు మాట్లాడే ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటారనే ఆశా భావాన్ని వ్యక్తం చేశారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మేకల తిరుపతి రెడ్డి, కార్యదర్శి బోయిని భూమయ్య, లోక్‌అదాలత్‌ సభ్యులు సీనియర్‌ న్యాయవాది మాడూరి ఆంజనేయులు, న్యాయవాది జోగుల రమేష్‌, ఎస్‌ఐ మదుకర్‌, సామాజిక కార్యకర్త కొండ రవియాదవ్‌, గ్రామస్తులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2025 | 11:53 PM