ప్రభుత్వాసుపత్రిలో పెయిడ్ గదులు
ABN , Publish Date - Mar 09 , 2025 | 12:53 AM
పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో పెయిడ్ గదులు సౌకర్యం ఏర్పాటు చేశారు. సాధారణ వార్డుల్లో ఉండలేని రోగులు ఆర్థిక స్థోమత గల వారు పెయిడ్ గదులను తీసుకుంటున్నారు. ఈ పెయిడ్ గదులతో యేటా లక్షల రూపాయల్లో ఆదాయం సమకూరుతోంది. 2022లో గదులను ప్రారంభించారు. జిల్లా ప్రధానాస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా పెయిడ్ రూమ్స్ ఏర్పాటు చేశారు.
పెద్దపల్లిటౌన్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో పెయిడ్ గదులు సౌకర్యం ఏర్పాటు చేశారు. సాధారణ వార్డుల్లో ఉండలేని రోగులు ఆర్థిక స్థోమత గల వారు పెయిడ్ గదులను తీసుకుంటున్నారు. ఈ పెయిడ్ గదులతో యేటా లక్షల రూపాయల్లో ఆదాయం సమకూరుతోంది. 2022లో గదులను ప్రారంభించారు. జిల్లా ప్రధానాస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా పెయిడ్ రూమ్స్ ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లలో వీటిని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఫస్ట్ ఫ్లోర్‌లో 11, సెకండ్ ఫ్లోర్‌లో 5 ఏర్పాటు చేశారు. సెకండ్ ఫ్లోర్‌లో 5 ఏసీ రూమ్స్ ఉన్నాయి. ఏసీ గదికి రోజుకు రూ.800, నాన్ ఏసీ గదులకు రూ.500 వసూలు చేస్తున్నారు. ఇందులో బాత్రూంతోపాటు పేషెంట్ బెడ్, వెంట ఉన్నవారికి ఒక్క బెడ్, ఏసీ, ఫ్యాన్లు, వాష్ బేషన్ సౌకర్యాలు కల్పించారు. వీటిని ఎక్కువగా గర్భిణులు, బాలింతలు, ఎముకలు విరిగిన వారు వినియోగించకుంటున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ఈ గదులను తీర్చిదిద్దారు. దీని ద్వారా వచ్చే ఆదాయంతో ఆస్ప్రత్రిలో మెయింటెనెన్స్ కోసం వినియోగిస్తున్నారు. జనరెటర్ డీజిల్, కరెంటు, కంప్యూటర్ల మరమతు, ఇంటర్‌నెట్ బిల్లులు, స్టేషనరీ, మందుల కొనుగోలు తదితర అవసరాలకు ఈ నిధులు వాడుతున్నారు. ప్రభుత్వం మందులు, డాక్టర్లకు, సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది వేతనాలు ఇస్తోంది. మిగితా ఖర్చులన్నీ పెయిడ్ రూమ్స్ నిధుల నుంచే ఖర్చు చేస్తున్నారు. సుమారు యేటా ఈ గదుల నుంచి రూ.15నుంచి 20 లక్షల ఆదాయం వస్తోంది. ఆస్పత్రి వైద్య సేవలతోపాటు పెయిడ్ రూమ్స్ ద్వారా ఆదాయం పెరిగింది.
ఆరు నెలల్లో వచ్చిన ఆదారం
సెప్టెంబరులో రూ.లక్షా 35 వేలు,
అక్టోబరులో రూ.లక్షా 50 వేలు,
నవంబరులో రూ.లక్షా 40 వేలు,
డిసెంబరులో లక్షా 50 వేలు,
జనవరిలో లక్షా 45 వేలు,
ఫిబ్రవరిలో రూ.లక్షా 16 వేలు
మొత్తం 8 లక్షల 36 రూపాయల ఆదాయం సమకూరింది.
మంచి రోజుల్లో గదులు ఖాళీ ఉండవు