సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యమివ్వాలి
ABN , Publish Date - Nov 15 , 2025 | 11:37 PM
రైతులు మోతాదుకు మించి ఎరువులను వినియోగిస్తూ భూసా రాన్ని దెబ్బతీస్తున్నారని, సేంద్రియ ఎరువులను వాడి భూములను కాపాడుకోవాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.
సుల్తానాబాద్, నవంబరు15(ఆంధ్రజ్యోతి): రైతులు మోతాదుకు మించి ఎరువులను వినియోగిస్తూ భూసా రాన్ని దెబ్బతీస్తున్నారని, సేంద్రియ ఎరువులను వాడి భూములను కాపాడుకోవాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారోత్సవాలు నిర్వహిం చారు. అనంతరం ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు వరితోపాటు ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని, వీటి ద్వారా అధిక లాభాలు ఆర్జించవచ్చని పేర్కొన్నారు.
సేంద్రియ ఎరువులతో భూముల్లో సారవం తం పెరుగుతుందని, అధిక యూరియా వాడటం ద్వారా దిగుబడులు తగ్గే అవకాశం ఉందన్నారు. వ్యవ సాయ అధికారులు, శాస్త్రజ్జుల సూచనల మేరకు ఆయిల్ పామ్ సాగు చేయాలని పేర్కొన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో రూ.60 వేల కోట్ల రైతు బోనస్ అం దించామని పేర్కొన్నారు. గతంలో పాలించిన పాలకులు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని, ప్రస్తుతం రైతుల వద్దకు వచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నారని, అలాంటి వారిని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.
కొనుగోలు కేంద్రం ప్రారంభం
చిన్నకలువలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎలాంటి కటింగు లు లేకుండా కొనుగోలు చేయాలని, రైతుల ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బులు ఖాతాల్లో జమ వుతాయని అన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, వ్యవసాయ ప్రాథమిక చైర్మన్ మినుపాల ప్రకాష్‌రావు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మోహన్‌రావు, మాజీ ఎంపీటీసీ పన్నాల రాము లు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, సహకార శాఖ రిజిస్టర్ వెంకటేశ్వర్లు, మండల వ్యవసాయ అధి కారి పైడితల్లి, సీఈఓ రమేష్, డైరెక్టర్లు, పాల్గొన్నారు.