యూరియాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:22 AM
జిల్లాలో ఎలాంటి యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ సింగిల్‌విండో కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతు యూరియా కొరత అంటూ బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, రైతులు ఆందోళన చెందవద్దని, సాగు మేరకు జిల్లాలో యూరియా సరఫరా జరుగుతుందన్నారు.
సుల్తానాబాద్, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎలాంటి యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ సింగిల్‌విండో కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతు యూరియా కొరత అంటూ బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, రైతులు ఆందోళన చెందవద్దని, సాగు మేరకు జిల్లాలో యూరియా సరఫరా జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 76 వేల ఎకరాలలో పంటలు సాగవుతున్నాయని, వాటి కోసం 28 లక్షల 195 మెట్రిక్ టన్నుల యూరియా ఆవసరం ఉందన్నారు.
పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాలతోపాటు ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారం ప్రాంతంలో ఇప్పటి వరకు 2 లక్షల 50 వేల ఎకరాలలో పంటలు సాగు చేశారన్నారు. మరో 15 వేల ఎకరాలలో నాట్లు వేస్తున్నారని, మంత్రి శ్రీధర్‌బాబు సహకారంతో 21 వేల 581 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. మరో 63 టన్నుల యూరియా అవసరం పడుతుందన్నారు. జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు యూరియా అక్రమంగా తరలిపోకుండా నాలుగు చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశామన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో యూరియా ఉత్పత్తి నిలిచిపోవడంతో కూడా సమస్య ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో విఫలమైందన్నారు. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాశ్ రావు, పన్నాల రాములు, సింగిల్ విండో చైర్మన్లు శ్రీగిరి శ్రీనివాస్, రాజేశ్వర్ రెడ్డి, దామోదర్ రావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అబ్బయ్యగౌడ్, మండల అధ్యక్షుడు చిలుక సతీష్, నాయకులు పాల్గొన్నారు.