బొగ్గు గనుల వేలం పాటను వ్యతిరేకించండి
ABN , Publish Date - Dec 19 , 2025 | 12:18 AM
సింగరేణిలో బొగ్గు గనుల వేలం పాటను వ్యతిరేకించాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో బీఆర్‌ఎస్ హయాంలో బొగ్గు గనుల వేలం పాట వేయకుండా అడ్డుకొన్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత గుర్తింపు సం ఘం ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీలు సిం గరేణి యాజమాన్యంతో కలిసి ప్రభుత్వం వద్దకు వెళ్లి సింగరేణిలో బొగ్గు గనులకు వేలం పాటలకు అనుమతి ఇవ్వాలని చెప్పడం దుర్మార్గమన్నారు.
గోదావరిఖని, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): సింగరేణిలో బొగ్గు గనుల వేలం పాటను వ్యతిరేకించాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో బీఆర్‌ఎస్ హయాంలో బొగ్గు గనుల వేలం పాట వేయకుండా అడ్డుకొన్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత గుర్తింపు సం ఘం ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీలు సిం గరేణి యాజమాన్యంతో కలిసి ప్రభుత్వం వద్దకు వెళ్లి సింగరేణిలో బొగ్గు గనులకు వేలం పాటలకు అనుమతి ఇవ్వాలని చెప్పడం దుర్మార్గమన్నారు. మణుగూరు బొగ్గు బ్లాకుల కు ఏడు దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తుం దని, సింగరేణి నుంచి ఒకటి, జెన్‌కో నుంచి రెండు, అదాని, మెథా, ఏఎంఆర్‌తో పాటుమరో రెండు సంస్థలు పోటీలో ఉన్నట్టు తెలుస్తుం దని, సింగరేణిలో వేలం పాట జరిగితే సింగ రేణికి అన్యాయం జరుగుతుందన్నారు. దీనిని వెంటనే రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశా రు. అన్నీ రకాల యంత్రాలు, మ్యాన్ పవర్ ఉన్న సింగరేణికి కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు ఎలా అప్పగిస్తారని, దీనిని కార్మికవర్గం గ్రహించాలని కోరారు. సింగరేణికి రాకుండా వేరే ఇతర కంపెనీకి వచ్చినట్లయితే సంస్థలో కార్మిక సంఘాలు, నాయకులు ఎవరూ ఉండ రని, బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆడ్డుకోవాలని, గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న బొగ్గగ బ్లాకులను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం పాట వేయడానికి ముం దుకు వస్తే కేసీఆర్, కేటీఆర్ తిప్పి కొట్టారని, ప్రైవేట్ కంపెనీలు వస్తే సింగరేణికి మనుగడ ఉండదన్నారు. సింగరేణిలో బొగ్గు బ్లాకులను సింగరేణికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి కే సురేందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి, నాయకులు నూనె కొమురయ్య, పర్లపల్లి రవి, జావెద్ పాషా, చెల్పూరి సతీష్, పానుగంటి సత్తయ్య, పొగాకు రమేష్, అన్వేష్‌రెడ్డి, వాసార్ల జోసెఫ్, జనగామ మల్లేష్, పల్లె సురేందర్, రెహమాన్, దేవెందర్, టిప్పుసుల్తాన్ పాల్గొన్నారు.