ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:03 AM
ఆపరేషన్ కగార్ నిలిపి వేయాలని ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 24 న అంబేద్కర్ భవన్ వరంగల్ లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం కరపత్రం, పోస్టర్ ఆవిష్కరించారు.
పెద్దపల్లిటౌన్, ఆగస్టు 17 (ఆంఽధ్రజ్యోతి): ఆపరేషన్ కగార్ నిలిపి వేయాలని ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 24 న అంబేద్కర్ భవన్ వరంగల్ లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం కరపత్రం, పోస్టర్ ఆవిష్కరించారు. వేదిక జిల్లా కన్వీనర్ ముడి మడుగుల మల్లన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్ర మానికి పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క నారాయణ రావు హాజరై మాట్లాడారు.
ఆపరేషన్ కగార్ నిలిపివేసి, పోలీస్ క్యాంపులు ఎత్తివేయాలని, తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని కేంద్ర ప్రభు త్వాన్ని సూచించారు. అటవీ హక్కుల పరిరక్షణ చట్టం, పెసా చట్టం, గ్రామసభ తీర్మానాలు అమలుపరచాలని, ఆదివాసులను చంపే హక్కు ఎవరికీ లేదని, రాజ్యాం గంలో జీవించే హక్కును కాలరాయొద్దన్నారు. దేశ సంపదపై హక్కు కొంతమంది కార్పోరేట్లకు మాత్రమే లేదని ఈ దేశ సంపద ప్రజలందరిదని పిలుపునిచ్చారు. చంద్ర మౌళి, జక్కుల వెంకటయ్య, మార్వాడీ సుదర్శన్, విశ్వనాథ్, రత్నకు మార్, గుమ్మడి కొమురయ్య, బాపు, రవి,జిందం ప్రసాద్, వై.లెనిన్, ఎరుకల రాజన్న, బొంకూరి లక్ష్మణ్, నారా వినోద్, పాల్గొన్నారు.