ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలి
ABN , Publish Date - Jun 17 , 2025 | 12:03 AM
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని అరుణోదయ కళా సంఘం గౌరవ అధ్యక్షురాలు విమలక్క డిమాండ్‌చేశారు. సోమవారం భాస్కర్‌రావు భవన్‌లో ఏర్పాటు చేసిన నిరసన సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
గోదావరిఖని, జూన్ 16(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని అరుణోదయ కళా సంఘం గౌరవ అధ్యక్షురాలు విమలక్క డిమాండ్‌చేశారు. సోమవారం భాస్కర్‌రావు భవన్‌లో ఏర్పాటు చేసిన నిరసన సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్‌లో కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలను, మావోయిస్టులను హత్య చేస్తుందని, కేంద్ర బలగాలతో అడవులను జల్లెడ పడుతూ ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టి ఖనిజ సంపదను అదాని, అంబానీలకు దోచి పెట్టడానికి కుట్ర చేస్తుందన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌షాలు 2026వరకు మావోయిస్టు పార్టీని అంతం చేయడానికి కంకణం కట్టుకున్నారని, దీనిని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని, ఎన్‌కౌంటర్ల పేరుతో 570మందిని హత్య చేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరుపాలని డిమాండ్ చేశారు. గోదావరిఖని చౌరస్తా నుంచి నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం అమరవీరుల సంస్మరణ సభను నిర్వహించారు. విశ్వనాథ్, రత్న కుమార్, విజయ్‌కుమార్, ఆరెల్లి కృష్ణ, మాదన కుమారస్వామి, మాదాసు రామమూర్తి, ముడిమడుగుల మల్లన్న, తాండ్ర సదానందం, రాజన్న పాల్గొన్నారు.