కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే గెలిపించాలి
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:51 AM
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తేనే గ్రామాలు మరింత అభివృద్ధి చెం దుతాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. గురువారం అందుగులపల్లిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అంజయ్య మద్దతుగా గురు వారం ఉదయం ప్రచారం నిర్వహించారు.
పెద్దపల్లి రూరల్, డిసెంబరు 11 (ఆంధ్ర జ్యోతి) : కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తేనే గ్రామాలు మరింత అభివృద్ధి చెం దుతాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. గురువారం అందుగులపల్లిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అంజయ్య మద్దతుగా గురు వారం ఉదయం ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంజయ్య గుర్తు ఉం గరం గుర్తు చూయిస్తూ బ్యాలెట్ నమూనా లతో ఇంటింటికి తిరుగుతూ ఓటు వేయాలని ఓటర్లను ఓటు అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గొడ్డేటి రాజయ్య, తలారి సాగర్, చీకటి చంద్రయ్య, బర్ల సదయ్య, ఎంచర్ల అంజయ్య లతో పాటు కార్యకర్తలు మరియు గ్రామాల ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.
ఎలిగేడు, (ఆంధ్రజ్యోతి): సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర ్థులను గెలిపించాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. జూలపల్లి, నాగులపల్లి, ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్, నారాయణపల్లి గ్రామాల్లో మొదటి విడత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ఆయా గ్రామాల్లో గడపగడపకు వెళ్తూ బ్యాలెట్ నమునాను చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిం చారు. కాంగ్రెస్‌తోనే పల్లె ప్రగతి సాధ్యమ వుతుందని గ్రామాల్లో మౌలిక సదుపా యాలతో పాటు మరింత అభివృద్ధి జరగా లంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా ప్రజలకు సన్న బియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. రెండు మండలా ల్లో అన్ని గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బలపరి చిన అభ్యర్థులను గెలిపించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు, కృషి చేయాలని పిలుపునిచ్చారు.