ఒకే గది... ఐదు తరగతులు
ABN , Publish Date - Nov 02 , 2025 | 11:28 PM
ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదుల కొరతతో ఉపాధ్యాయులు, విద్యార్థులు సమస్యలు ఎదుర్కొం టున్నారు. మంథని మండలంలో 42 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. అందులో 10 పాఠశాలలో సింగిల్ తరగతి గది ఉన్న పాఠశాలలు ఉండగా రెండు పాఠశాలలకు సొంత భవనాలు లేక ప్రైవేటు భవనాలలో పాఠశాలలు నిర్వహిస్తున్నారు.
మంథనిరూరల్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదుల కొరతతో ఉపాధ్యాయులు, విద్యార్థులు సమస్యలు ఎదుర్కొం టున్నారు. మంథని మండలంలో 42 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. అందులో 10 పాఠశాలలో సింగిల్ తరగతి గది ఉన్న పాఠశాలలు ఉండగా రెండు పాఠశాలలకు సొంత భవనాలు లేక ప్రైవేటు భవనాలలో పాఠశాలలు నిర్వహిస్తున్నారు. మల్లారం, వెంకటాపూర్, బట్టుపల్లి, శ్రీరాములపల్లి, సూరయ్యపల్లి, కూచిరాజ్‌పల్లి, లక్కారం, తోటగో పాయ్యపల్లి, లక్ష్మిపూర్, మైదుపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠ శాలలో వరండా, ఒక తర గతి గది ఉంది. దీంతో ఒకటి నుంచి ఐదు తర గతుల వరకు ఒకటే గదిలో బోధన చేయాల్సిన పరిస్థితి ఉం డటంతో ఉపాఽధ్యా యులకు, విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. ఒకటే గదిలో ఆఫీస్ నిర్వహణ, విద్యాబో ధన చేయాల్సిన పరి స్థితి నెలకొంది. పాఠశాలలు అద నంగా ఉంటే తర గతుల నిర్వహణ సులభతరంగా ఉంటుందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. తరగతుల నిర్వహణ సమయంలో చిన్న పిల్లల అల్లరితో పెద్ద తరగతుల విద్యార్థులు ఇబ్బందులు పడాల్సిన పరి స్థితి నెలకొన్నది. స్వంత భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో బిట్టుపల్లి, కాకర్లపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలను ప్రయివేటు ఇండ్లలో నిర్వహిస్తున్నారు. సింగిల్ తరగతి గదులు ఉన్న పాఠశాలలో అదనపు తరగతి గదులు నిర్మిం చి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.