యాదవులకు ఒక రోజు రాజకీయ శిక్షణ
ABN , Publish Date - Oct 21 , 2025 | 11:21 PM
ఉమ్మడి జిల్లాలోని యాద వులకు ఈనెల 24న ఒక రోజు రాజకీయ శిక్షణ శిబిరం నిర్వ హిస్తున్నట్లు యాదవ సంఘ జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేష్ తెలి పారు. మండల కేంద్రంలో అఖిల భారత యాదవ మహాసభ మం డల ఉపాధ్యక్షుడు జిల్లా కనుకన్న అధ్యక్షతన జరిగిన సమావేశం అనం తరం విలేకరులతో మాట్లాడారు.
ధర్మారం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలోని యాద వులకు ఈనెల 24న ఒక రోజు రాజకీయ శిక్షణ శిబిరం నిర్వ హిస్తున్నట్లు యాదవ సంఘ జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేష్ తెలి పారు. మండల కేంద్రంలో అఖిల భారత యాదవ మహాసభ మం డల ఉపాధ్యక్షుడు జిల్లా కనుకన్న అధ్యక్షతన జరిగిన సమావేశం అనం తరం విలేకరులతో మాట్లాడారు.
ఈ నెల 24న శుక్రవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మానకొండూర్ మండలం ఖాదర్‌గూడెంలోని అరబిందా ఫామ్‌హౌస్‌లో శిక్షణ ఉంటుందని తెలి పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే యాదవ అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. తిరుపతి, సంధినేని రాజేందర్ ఆవుల ఐలయ్య, వేల్పుల నాగరాజు, ఉప్పరి శ్రీనివాస్, బత్తిని లక్ష్మణ్, ఈదుల శ్రీనివాస్, సంపత్, ఆవుల మల్లయ్య, పాల్గొన్నారు.