Share News

ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యాలను పూర్తి చేయాలి

ABN , Publish Date - Jun 23 , 2025 | 11:40 PM

ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యాలను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికా రులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆయిల్‌ పామ్‌ సాగు విస్తీర్ణం, ఎరువుల లభ్యతపై అధి కారులతో సోమవారం సమీక్షించారు. ఆయిల్‌ పామ్‌ సాగుకు ముందుకు వచ్చిన రైతులకు సబ్సిడీ, డ్రిప్‌ ఏర్పాటు, మొక్కలు నాటడం త్వరి తగతిన జరగాలన్నారు.

ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యాలను పూర్తి చేయాలి

పెద్దపల్లి టౌన్‌, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యాలను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికా రులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆయిల్‌ పామ్‌ సాగు విస్తీర్ణం, ఎరువుల లభ్యతపై అధి కారులతో సోమవారం సమీక్షించారు. ఆయిల్‌ పామ్‌ సాగుకు ముందుకు వచ్చిన రైతులకు సబ్సిడీ, డ్రిప్‌ ఏర్పాటు, మొక్కలు నాటడం త్వరి తగతిన జరగాలన్నారు. 25 వందల ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ సాగు విస్తరణ లక్ష్యం చేరుకు నేందుకు కార్యాచరణ అమలు చేయాలని తెలి పారు. జిల్లాలో 880 ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ సాగుకు రైతులు ముందుకు వచ్చారని, వీరికి అవసరమైన మంజూరు ప్రక్రియ చేయాల న్నారు. జిల్లాలో పంట దిగుబడి వస్తుందని, రైతుల వద్ద నుంచి కంపెనీ ప్రతినిధులు కొనుగోలు చేస్తున్నారని, ప్రస్తుత సీజన్‌లో 100 ఎకరాల వరకు ఆయిల్‌ పామ్‌ పంట దిగుబడి వస్తుందని అంచనా వేశామని తెలిపారు. 10 ఎకరాల కంటే ఎక్కువ భూములు ఉన్న రైతు లను ఆయిల్‌ పామ్‌ సాగు విస్తరణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ తెలిపారు. వ్యవసాయ విస్తరణ అధికారికి లక్ష్యాలను కేటాయించాలని సూచించారు. వర్షాకాలంలో రైతులకు అవసర మైన ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉం డాలని, ఎరువుల స్టాక్‌ వివరాలను పర్యవేక్షిం చాలని తెలిపారు. జిల్లా వ్యవసాయ శాఖ అధి కారి ఆదిరెడ్డి, జిల్లా హార్టికల్చర్‌ అధికారి జగన్‌ మోహన్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

మొక్కలు నాటి సంరక్షించాలి

వనమహోత్సవంలో మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. వన మహోత్స వం, ప్రోటోకాల్‌పై స్థానిక సంస్థల అదనపు కలె క్టర్‌ జే. అరుణశ్రీతో కలిసి సమీక్షించారు. వన మహోత్సవంలో 30 లక్షలకుపైగా మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్దేశించామన్నారు. ప్రతిశా ఖ తమకు కేటాయించిన లక్ష్యం మేరకు మొక్క లు నాటాలని సూచించారు. ఎక్కడ మొక్కలు నాటుతారో స్థలాల ఎంపిక సోమవారం నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. మొక్కల సంరక్ష ణకు అవసరమైన ట్రీ గార్డ్‌, కర్రపాదులు ఏర్పా ట్లు చేయాలన్నారు. ప్రతి శాఖ మొక్కలు నాటే స్థలం ట్యాగ్‌ చేసి పెట్టుకోవాలన్నారు. గుంతల తవ్వకం పనులు ఉపాధిహామీ పథకం కింద చేపట్టాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాల న్నారు. ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రోటోకాల్‌ నిబంధనలను పాటించాలన్నారు. ప్రోటోకాల్‌ కింద ప్రభుత్వ కార్యక్రమాలకు ఎవరిని ఆహ్వా నించారో నివేదికను అందించాలని కలెక్టర్‌ సూచించారు. ప్రతి శాఖ పరిధిలో పెండింగ్‌ ఫైల్స్‌ వివరాలను అందించాలని తెలిపారు.

Updated Date - Jun 23 , 2025 | 11:40 PM