ఆయిల్‌పామ్ పంటలను సాగు చేయాలి
ABN , Publish Date - Jul 12 , 2025 | 12:12 AM
జిల్లాలో ఉద్యాన, ఆయిల్‌పామ్ పంటల సాగుదిశగా రైతులను ప్రోత్సహించాలని డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ జిల్లా ప్రత్యే కాధికారి టి.శేఖర్ పేర్కొన్నారు. మండలంలోని అడవి శ్రీరాంపూర్, ముత్తారం, ఓడేడు, కమాన్‌పూర్ మండలం గుండారం గ్రామాలలో కూరగాయలు, ఆయిల్‌పామ్ పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ముత్తారం, జూలై 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉద్యాన, ఆయిల్‌పామ్ పంటల సాగుదిశగా రైతులను ప్రోత్సహించాలని డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ జిల్లా ప్రత్యే కాధికారి టి.శేఖర్ పేర్కొన్నారు. మండలంలోని అడవి శ్రీరాంపూర్, ముత్తారం, ఓడేడు, కమాన్‌పూర్ మండలం గుండారం గ్రామాలలో కూరగాయలు, ఆయిల్‌పామ్ పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయిల్‌పామ్ సాగుచేసి ప్రభుత్వం అందించే రాయితీలను సద్విని యోగం చేసుకోవాలని రైతులకు అవగాహన కల్పిం చారు. ఆయిల్‌పామ్ పంటలో అంతర పంటగా కూర గాయలు, పూలతోటలను సాగుచేసి అదనపు ఆదాయం పొంద వచ్చన్నారు. అడవిశ్రీరాంపూర్ 3సంవత్సరాల క్రితం నాటిన కళ్యాణపు రామయల్లు, నంసాని సమ్మ య్య తోటలు కోతకు రాగా పరిశీలించారు.
కమాన్ పూర్ మండలంలోని గుర్రాల రాజయ్య, గరిగంటి రాజే ష్, పెండ్యాల ఓదెలు, రవి ఆయిల్‌పామ్ పంటలో అం తరపంటగా కూరగాయల పంటలను, శాశ్వత పందిర్ల నిర్మాణంపై సాగుచేసే ఉద్యాన పంటలను పరిశీలించారు. ఎంఐడీహెచ్ స్కీం ద్వారా పండ్లతోటలు, కూరగాయల పంటలకు రాయితీ, బిందు సేద్యం పరి కరాలపైన 90శాతం రాయితీ అందేలా ప్రణాళికబద్దంగా పనిచేయాలని సూచించారు. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి సీ.జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాయితీ ఇస్తామని, రైతులు ఆయిల్‌పామ్ పంటను సా గుచేయాలనిసూచించారు. ఉద్యానవన అధికారి జ్యోతి, ఆయిల్‌ఫామ్ ఫీల్డ్ ఆఫీసర్ అజయ్, అనిల్, రైతులు రాజేశ్వర్‌రావు, సమ్మయ్య, దేవేందర్ పాల్గొన్నారు.