Share News

అభివృద్ధే లక్ష్యంగా అధికారులు పని చేయాలి

ABN , Publish Date - Jun 04 , 2025 | 12:13 AM

పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పని చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ అన్నారు. మంగళవారం ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియం హాల్‌ లో అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జి మున్సిపల్‌ కమిషనర్‌ జె. అరుణశ్రీతో కలిసి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.

 అభివృద్ధే లక్ష్యంగా అధికారులు పని చేయాలి

జ్యోతినగర్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పని చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ అన్నారు. మంగళవారం ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియం హాల్‌ లో అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జి మున్సిపల్‌ కమిషనర్‌ జె. అరుణశ్రీతో కలిసి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన తరువాత పట్టణంలో కోట్లాది రూపాయల నిధుల తో పలు అభివృద్ధి పనులతోపాటు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా మన్నారు. అభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తయ్యేలా, సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంద న్నారు. అధికారుల పనితీరుతోనే ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతుందని ఎమ్మె ల్యే తెలిపారు. పారిశుధ్య కార్మికుల సేవలతో ప్రజా ఆరోగ్యం, నగర సౌం దర్యం ముడిపడి ఉన్నందున ఈ విషయంలో పొరపాట్లు లేకుండా చూడాలని సూచించారు. పారిశుధ్య కార్మికులు, వాహనాలు అందు బాటులో ఉన్నాయని, సిబ్బంది నిబద్ధతతో పని చేయాలన్నారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజల సౌకర్యం కోసం చేపట్టిన రోడ్డు వెడెల్పు, విస్తరణ పనుల విష యంలో రాజీ పడే ప్రసక్తే లేదని మక్కాన్‌సింగ్‌ స్పష్టం చేశారు. కోనో కార్పస్‌ మొక్కలను తొలగించి బోగన్‌విల్లా, పాంట్రీ తదితర జాతుల మొక్కలను నాటాలన్నారు. వనమహోత్సవంలో పెద్ద సంఖ్యలో మొక్క లను నాటాలని సూచించారు. శాలపల్లి రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఎన్టీపీసీ సహకారాన్ని అందించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం విషయంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని రామగుండం తహసీల్దార్‌కు సూచించారు. రాజీవ్‌ రహదారిపైకి వాహనాలు వచ్చే సమ యంలో రోడ్డు ప్రమాదాలు జరుగతున్నాయని, ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బి, హెచ్‌కెఆర్‌ అధికారులను ఆదేశిం చారు. లారీలు రోడ్డుపై నిలపకుండా ఆటోనగర్‌లోనే పార్కు చేసేలా ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. రాజీవ్‌ రహదారిలో రోడ్డుకు అడ్డుగా ఉన్న విద్యుత్‌ స్తంభాలను తొలగించాలని ట్రాన్స్‌కో అధికారులకు, వర్షాకాలంలో శాంతినగర్‌ ముంపునకు గురి కాకుండా నాలాను అభివృద్ధి చేయాలని ఆర్‌ఎఫ్‌సీఎల్‌ అధికారులకు సూచించారు. వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అంశాలను ఇన్‌చార్జి కమిషనర్‌ అరుణశ్రీ వివరించారు. ఉత్తమ పనితీరు కనబర్చిన అధికారులు, సిబ్బం దికి పురస్కారాలు అందజేస్తామని తెలిపారు. ఏసీపీలు ఎం.రమేష్‌, సిహెచ్‌.శ్రీనివాస్‌, డిప్యూటీ కమీషనర్‌ సాయిని వెంకటస్వామి, ఎస్‌ఇ శివానంద్‌, ఈఈ రామన్‌, తహసీల్దార్‌ దత్తుప్రసాద్‌, ఎన్టీపీసీ అధికారులు మయాంక్‌, బాలసుబ్రహ్మణ్యం, సూర్యనారాయణ, ప్రవీణ్‌ చౌదరి, అధి కారులు వసంత్‌, సునీత, ధనుంజయ్‌, డిఈ ప్రభాకర్‌, ఎడిఈలు వెం కటేశ్వర్లు, రమేష్‌, డిఎఫ్‌వో సాంబయ్య, ఆర్‌వోఎం నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2025 | 12:13 AM