నర్సింగ్ సిబ్బంది వర్సెస్ సూపర్‌వైజర్
ABN , Publish Date - Jun 25 , 2025 | 12:16 AM
గోదావరి ఖని ప్రభుత్వ జనరల్ ఆసు పత్రిలో ఫొటోల వివాదం రచ్చకెక్కింది. విధుల్లో ఉన్న నర్సుల ఫొటోలు కాంట్రాక్టు సూపర్‌వైజర్ తీస్తూ ఇబ్బం దులకు గురి చేస్తున్నారని, వేధింపులకు పాల్పడు తున్నారని ఈనెల 14న నర్సింగ్ సిబ్బంది 200 మంది సూపరింటెండెంట్ దయాల్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు.
కళ్యాణ్‌నగర్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): గోదావరి ఖని ప్రభుత్వ జనరల్ ఆసు పత్రిలో ఫొటోల వివాదం రచ్చకెక్కింది. విధుల్లో ఉన్న నర్సుల ఫొటోలు కాంట్రాక్టు సూపర్‌వైజర్ తీస్తూ ఇబ్బం దులకు గురి చేస్తున్నారని, వేధింపులకు పాల్పడు తున్నారని ఈనెల 14న నర్సింగ్ సిబ్బంది 200 మంది సూపరింటెండెంట్ దయాల్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. మంగళవారం కూడా నర్సులు, సూప ర్‌వైజర్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నర్సింగ్ సూపరింటెండెంట్‌కు సూపర్‌వైజర్ వ్యవహారం పై తమ ఆవేదనను వెల్లడించారు. వివాదం ముదరడంతో ఆర్‌ఎంవో రాజు నర్సింగ్ సిబ్బంది, సూప ర్‌వైజర్‌ను పిలిచి మాట్లాడారు.
పారిశుధ్య సిబ్బంది, కేర్‌టేకర్‌ల పనిపై ఎప్పకప్పుడు ఫొటోలు తీసు కుంటున్నానని, కొందరు నర్సింగ్ సిబ్బంది సంబంధం లేని పనులను కేర్ టేకర్లతో చేయించుకుం టున్నారని సూపర్‌వైజర్ ఆర్‌ఎంవోకు వివరించారు. తమను కావాలని ఫొటోలు తీస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని నర్సులు ఆర్‌ఎంవో ముందు ఏకరువు పెట్టారు. ఇరువర్గాలతో మాట్లాడి ఇకపై ఆసుపత్రిలో గొడవలకు చోటు లేకుండా ఉండాలని, సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలే తప్ప గొడవకు దిగవద్దని, రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా పని చేయాలని, ఎవరి విధులు వారు నిర్వహించుకోవాలని ఆర్‌ఎంవో సూచించారు.