ప్రభావిత గ్రామాలపై ఎన్టీపీసీ నిర్లక్ష్యం
ABN , Publish Date - Apr 24 , 2025 | 11:57 PM
యాష్ పాండ్ పైపులైన్ పగిలిన సంఘటనలో ఎన్‌టీపీసీ యాజమాన్యం నిర్లక్ష్యం కనబడుతుందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. కుందనపల్లి ఏరియా అక్బర్‌నగర్‌లో ఎన్‌టీపీసీ యాష్‌పాండ్ పైపులైన్ పగిలి ఇళ్లలోకి బూడిద నీరు చేరింది. గురువారం ఎంపీ అక్బర్‌నగర్‌ను సందర్శించారు. బూడిద నీరు కారణంగా అస్తవ్యస్తమైన నివాస గృహాలను పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శిం చారు.
అంతర్గాం, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): యాష్ పాండ్ పైపులైన్ పగిలిన సంఘటనలో ఎన్‌టీపీసీ యాజమాన్యం నిర్లక్ష్యం కనబడుతుందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. కుందనపల్లి ఏరియా అక్బర్‌నగర్‌లో ఎన్‌టీపీసీ యాష్‌పాండ్ పైపులైన్ పగిలి ఇళ్లలోకి బూడిద నీరు చేరింది. గురువారం ఎంపీ అక్బర్‌నగర్‌ను సందర్శించారు. బూడిద నీరు కారణంగా అస్తవ్యస్తమైన నివాస గృహాలను పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శిం చారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ప్రభావిత గ్రామాలపై నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఎన్‌టీపీసీ నిర్లక్ష్యవైఖరి కారణంగా జరిగిన సంఘటనను కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకుపోతానని పేర్కొన్నారు. ఎన్‌టీ పీసీ యాజమాన్యం సీఎస్‌ఆర్‌సీడీ ద్వారా సమీప గ్రామాల అభివృద్ధికి ఎంత నిధులు వెచ్చిస్తున్నదో తెలుపాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు షేక్ ఇఫ్తేకార్ అహ్మద్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించి సమస్యలపై మాట్లా డారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాబర్ సలీంపాషా, ఠాకూర్ అయోధ్య సింగ్, పిల్లి మలి కార్జున్, జీన్స్ అనుమాస్ శ్రీనివాస్, కాంతాల శ్రీనివాస్‌రెడ్డి, లియాకత్ అహ్మద్, పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలను
ఆదుకుంటాం : ఎమ్మెల్యే
గోదావరరిఖని, (ఆంధ్రజ్యోతి): రామగుండం అక్బర్‌నగర్ కాలనీవాసులు అధైర్యపడవద్దని, అం డగా ఉంటానని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠా కూర్ భరోసా ఇచ్చారు. బుధవారం రాత్రి ఎన్‌టీ పీసీ నుంచి కుందనపల్లికి వెళ్లే యాష్‌పైప్‌లైన్ పగలడంతో ఇండ్లలోకి నీరు వచ్చిందని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్, ఎన్‌టీపీసీ అధికారులతో చర్చించామన్నారు. రిటర్నింగ్ వాల్ నిర్మించి భవిష్యత్‌లో ఇలాంటి ఘటన పునరావృ తం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎన్‌టీపీసీ యాజమాన్యాన్ని ఆదేశించినట్టు పేర్కొన్నారు.