Share News

ఐదు దశాబ్దాలుగా ఎన్టీపీసీ వెలుగులు

ABN , Publish Date - Nov 07 , 2025 | 11:53 PM

ఐదు దశాబ్దాలుగా దేశానికి వెలుగులను అందిస్తూ ప్రపంచ అగ్రగామి సంస్థగా ఎన్టీపీసీ వెలుగొందుతోందని రామగుండం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చందన్‌కుమార్‌ సామంత అన్నారు. ఎన్టీపీసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు.

ఐదు దశాబ్దాలుగా ఎన్టీపీసీ వెలుగులు

జ్యోతినగర్‌, నవంబరు7(ఆంధ్రజ్యోతి): ఐదు దశాబ్దాలుగా దేశానికి వెలుగులను అందిస్తూ ప్రపంచ అగ్రగామి సంస్థగా ఎన్టీపీసీ వెలుగొందుతోందని రామగుండం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చందన్‌కుమార్‌ సామంత అన్నారు. ఎన్టీపీసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. దేశాభివృద్ధికి ఎన్టీపీసీ చేయూతనందిస్తుందన్నారు. పారిశ్రామిక, గృహ అవసరాలకు విద్యుత్‌ అందిస్తున్నామని తెలిపారు. దేశంలో నాలుగో వంతు విద్యుత్‌ను ఎన్టీపీసీ సంస్థ నిరంతరాయంగా అందిస్తుందన్నారు. ఎన్టీపీసీ సిబ్బంది కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. భవిష్యత్‌లో ఇదే స్ఫూర్తితో ఉద్యోగులు పని చేయాలని ఆయన కోరారు. విద్యుత్పత్తితోపాటు సామాజిక అభివృద్ధికి ఎన్టీపీసీ కృషి చేస్తున్నదన్నారు.

ఎన్టీపీసీ కాకతీయ ఆడిటోరియం, ఈడీ రెసిడెన్షియల్‌ ఏరియాలో మాస్‌ ట్రీ ప్లాంటేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. చందన్‌కుమార్‌ ఎన్టీపీసీ జెండాను ఆవిష్కరించారు. అలాగే ఎన్టీపీసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈడీ కేక్‌ కట్‌ చేశారు. విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. ఆయా విభాగాల జీఎంలు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2025 | 11:53 PM