Share News

బాలిక సాధికారతకు ఎన్‌టీపీసీ కృషి

ABN , Publish Date - May 06 , 2025 | 11:54 PM

ఎన్‌టీపీసీ బాలి కా సాధికారతకు కృషి చేస్తున్నదని రామగుండం, తెలంగాణ ఎన్‌టీపీసీ ప్రాజెక్టుల ఈడీ చందన్‌ కుమార్‌ సామంత అన్నారు. మంగళవారం ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలిక సాధికారత మిషన్‌ (జెమ్‌) వర్క్‌షాప్‌ను ఈడీ ప్రారంభించారు. ఎన్‌టీ పీసీ పీటీఎస్‌లోని కాకతీయ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఈడీ మాట్లాడారు.

బాలిక సాధికారతకు ఎన్‌టీపీసీ కృషి

జ్యోతినగర్‌, మే 6(ఆంధ్రజ్యోతి): ఎన్‌టీపీసీ బాలి కా సాధికారతకు కృషి చేస్తున్నదని రామగుండం, తెలంగాణ ఎన్‌టీపీసీ ప్రాజెక్టుల ఈడీ చందన్‌ కుమార్‌ సామంత అన్నారు. మంగళవారం ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలిక సాధికారత మిషన్‌ (జెమ్‌) వర్క్‌షాప్‌ను ఈడీ ప్రారంభించారు. ఎన్‌టీ పీసీ పీటీఎస్‌లోని కాకతీయ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఈడీ మాట్లాడారు. ఎన్‌టీపీసీ విద్యుత్‌ ఉత్పత్తితో పాటు సామాజిక కార్యక్రమాలను నిర్వహి స్తున్నదన్నారు. బాలికల సాధికారత, వారి అభ్యు న్నతికి ఎన్‌టీపీసీ ప్రయత్నిస్తోందన్నారు. బాలికలను మరింతగా ప్రోత్సహించేందుకు ఆరు సంవత్సరాలుగా గర్ల్‌ ఎంపవర్‌మెంట్‌ మిషన్‌ పేరిట 8వ తరగతి చదు వుతున్న 120 మంది విద్యార్థినులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. అమ్మాయిలలో డ్రాప్‌ అవు ట్లను తగ్గించటం లక్ష్యంగా ఈ వర్క్‌షాప్‌లు కొనసా గిస్తున్నామన్నారు. అమ్మాయిలకు అవకాశ మిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్నారు. ఈ అవకాశాన్ని విద్యా ర్థినులు సద్వినియోగం చేసుకొని ముందుకు సాగా లని ఆకాంక్షించారు. శిక్షణ పొందుతున్న బాలి కలకు బ్యాగులు ఇతర వస్తువులను ఈడీ పంపిణీ చేశారు. దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సమంత, ఎన్‌టీపీసీ అధికారులు, పాల్గొన్నారు.

బాలికా సాధికారత వర్క్‌షాప్‌ ప్రారంభం

ఎన్‌టీపీసీ సీఎస్‌ఆర్‌ ఆధ్వర్యంలో బాలికా సాధికా రత మిషన్‌ వర్క్‌షాప్‌ మంగళవారం ప్రారంభ మైంది. 28 రోజుల పాటు ఎన్‌టీపీసీ చుట్టుపక్కల నాలుగు మండలాలకు చెందిన 120 మంది 8వ తర గతి బాలికలకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వర్క్‌ షాప్‌లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌లతో పాటు మ్యాథమెటిక్స్‌, సైన్స్‌లలో ప్రత్యేక శిక్షణ అందిస్తారు. అలాగే చిత్రలేఖనం, యోగ, కరాటే తదితర అంశా లలో శిక్షణ ఇస్తారు.

Updated Date - May 06 , 2025 | 11:54 PM