దేశాభివృద్ధిలో ఎన్టీపీసీ కీలక పాత్ర
ABN , Publish Date - Aug 15 , 2025 | 11:23 PM
దేశాభి వృద్ధిలో ఎన్టీపీసీ కీలక పాత్ర పోషిస్తున్నదని, దేశానికి నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తోందని రామగుండం, తెలంగాణ ఎన్టీపీసీ ఈడీ చందన్ కుమార్ సామంత అన్నారు. స్వాతంత్య్ర దినోత్స వం సందర్భంగా శుక్రవారం మహాత్మగాంధీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఈడీ జాతీయ జెండాను ఎగుర వేశారు.
జ్యోతినగర్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): దేశాభి వృద్ధిలో ఎన్టీపీసీ కీలక పాత్ర పోషిస్తున్నదని, దేశానికి నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తోందని రామగుండం, తెలంగాణ ఎన్టీపీసీ ఈడీ చందన్ కుమార్ సామంత అన్నారు. స్వాతంత్య్ర దినోత్స వం సందర్భంగా శుక్రవారం మహాత్మగాంధీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఈడీ జాతీయ జెండాను ఎగుర వేశారు. అనంతరం ప్రసంగిస్తూ దేశంలో నాల్గవ వంతు విద్యుత్ ఎన్టీపీసీ సంస్థ నుంచే దేశానికి సరఫరా అవు తున్నదన్నారు. ఉద్యోగులు, అధికారులు, కాంట్రా క్టు కార్మికులు, ఏజెన్సీల సమిష్ఠి కృషి ఫలితం గానే ఎన్టీపీసీ దేశంలోనే అగ్రగామి విద్యుత్ సంస్థగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తితోపాటు సామాజిక బాధ్యతను ఎన్టీపీసీ నెరవేరుస్తున్నదని, సీఎస్‌ఆర్ పథకం ద్వారా ప్రభావిత ప్రాంతాలను అభివృద్ధి చేస్తు న్నామన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని తెలిపారు. కాగా, రామ గుండం ఎన్టీపీసీ ప్లాంటు మేడే పార్కులో సీజీ ఎం(ఓఅండ్‌ఎం) ఎ.కె.త్రిపాఠి, తెలంగాణ ఎన్టీపీసీ(టిఎస్‌టిపిపి) ప్రాజెక్టులో జీఎం అలోక్ రాయ్, ఏడీఎం భవనంలో జీఎం బినోయ్ జోస్ త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించారు.
ఎన్టీపీసీ ఈడీ చందన్ కుమార్‌రాయ్‌కు సీఐఎస్‌ఎఫ్ వానులు గౌరవ వందనం అందజేశారు. విద్యా ర్థులు, ఎన్‌సీసీ కేడెట్లు మార్చ్‌పాస్ట్ నిర్వహిం చారు. ఎన్టీపీసీలో అత్యుత్తమ సేవలు అందిస్తు న్న ఉద్యోగులు, అధికారులు, ఐసీహెచ్ సిబ్బం దికి ఎన్టీపీసీ ఈడీ చందన్ కుమార్ సర్టిఫికెట్లు, జ్ఞాపికలను అందజేశారు. ప్రభావిత ప్రాంతా లకు చెందిన విద్యార్థినులకు సీఎస్‌ఆర్ కింద సైకిళ్లను అందజేశారు. బాల్ భవన్, కేంద్రీయ విద్యాలయం, సెయింట్ క్లేర్ స్కూల్, సచ్‌దేవ, జెడ్పీ పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సాం స్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సీఐ ఎస్‌ఎఫ్ సీనియర్ కమాండెంట్ అరవింద్ కుమార్, ఏజీఎం(హెచ్‌ఆర్) విజయ్ కుమార్ సిక్దర్, ఉద్యోగులు, గుర్తింపు కార్మిక సంఘం, అధికారుల సంఘం నాయకులు పాల్గొన్నారు.