ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఎన్టీపీసీ బూడిద దందా
ABN , Publish Date - Mar 05 , 2025 | 12:03 AM
మగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ కను సన్నలలో ఎన్టీపీసీలో బూడిద దందా నడు స్తోందని, ఎమ్మెల్యే అనుయాయులైన కొం దరు కాంట్రాక్టర్లు లారీకి 4 వేల రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు కౌశిక హరి ఆరోపిం చారు. మంగళవారం ఎన్టీపీసీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎల్కలపల్లి యాష్‌పాండ్ నుంచి ఎన్టీపీసీ ఒక రూపా యికే టెండరు ద్వారా బూడిద ఇటుకల తయారీదారులకు సరఫరా చేయాల్సి ఉం డగా కొందరు దళారులు ఇటుకల పరిశ్రమల యజమానులకు రవాణా చేస్తున్నారన్నారు.

జ్యోతినగర్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ కను సన్నలలో ఎన్టీపీసీలో బూడిద దందా నడు స్తోందని, ఎమ్మెల్యే అనుయాయులైన కొం దరు కాంట్రాక్టర్లు లారీకి 4 వేల రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు కౌశిక హరి ఆరోపిం చారు. మంగళవారం ఎన్టీపీసీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎల్కలపల్లి యాష్‌పాండ్ నుంచి ఎన్టీపీసీ ఒక రూపా యికే టెండరు ద్వారా బూడిద ఇటుకల తయారీదారులకు సరఫరా చేయాల్సి ఉం డగా కొందరు దళారులు ఇటుకల పరిశ్రమల యజమానులకు రవాణా చేస్తున్నారన్నారు.
ఎమ్మెల్యేకు చెందిన 4గురు కాంట్రాక్టర్లు యాష్‌పాండ్‌లో బూడిదను మెషీన్ల ద్వారా లోడ్ చేయించి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. రోజుకు వందలాది లారీల యాష్‌పాండ్ నుంచి రవాణా చేస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపిం చారు. జాతీయ రహదారి నిర్మించే కాంట్రా క్టర్లకు ఉచితంగా లోడింగు, రవాణా చేయి స్తుండగా, ఇటుకల తయారీ పరిశ్రమల యజమానులకు చార్జీలు వసూలు చేస్తున్నా రన్నారు. ఎన్టీపీసీ ఈడీ చందన్ కుమార్‌కు ఫిర్యాదు చేశామని, ఉచితంగా బూడిద నింప డంతోపాటు రవాణా ఖర్చులు చెల్లించాలని కోరినట్లు చెప్పారు. 115 మంది టెండరు దారులకు బూడిద రవాణాకు అనుమతి తోపాటు స్థానిక లారీలలోనే రవాణా చేసేలా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బూడిద అక్రమ దందా విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి నాయకుడు, ప్రజలు స్పందించాలని కోరారు. బీఆర్‌ఎస్ నాయకులు శ్రీనివాస్, బుర్ర శంకర్ గౌడ్, రాంబాబు, ప్రవీణ్, శంకర్, సతీష్ పాల్గొన్నారు.