ఘనంగా ఎన్‌ఎస్‌ఎస్ వార్షికోత్సవం
ABN , Publish Date - Oct 25 , 2025 | 11:49 PM
గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శని వారం ఎన్‌ఎస్‌ఎస్ వార్షికోత్స వాన్ని ఘనంగా నిర్వహిం చారు. శాతవాహన విశ్వ విద్యాలయ ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డా.మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై వలంటీర్లను ఉద్దేశించి మాట్లాడారు.
కోల్‌సిటీటౌన్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శని వారం ఎన్‌ఎస్‌ఎస్ వార్షికోత్స వాన్ని ఘనంగా నిర్వహిం చారు. శాతవాహన విశ్వ విద్యాలయ ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డా.మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై వలంటీర్లను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులకు కళాశాల జీవితం అనేది జీవితాం తం గుర్తుండిపోతుందని, ప్రతి విద్యార్థి తన కంటూ ఒక విశిష్టమైన అభిరు చి పెంపొందిం చుకోవడంతోపాటు ఏదైనా అంశంలో నైపుణ్యం కలిగి ఉండాలని అభిప్రాయపడ్డారు.
ప్రతి వలంటీర్ వ్యక్తిత్వం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని సూచించారు. వికసిత భారత్, యూత్ పార్లమెంట్, స్పెషల్ క్యాంప్ వంటి కార్యక్రమాల్లో పాల్గొని అవకాశా లను అందిపుచ్చకోవడం అభినంద నీయమని కళాశాల ప్రిన్సిపాల్ జైకిషన్‌ఓఝా ప్రశంసించారు. వలంటీర్లు డ్యాన్స్, స్కిట్ కార్యక్రమాలు ప్రదర్శించారు. జిల్లా ఎన్‌ఎస్‌ఎస్ నోడల్ ఆఫీసర్ డా. ప్రసా ద్‌బాబు, బాలికల జూనియర్ కళాశాల ప్రోగ్రాం ఆఫీసర్ శంకర్‌పటేల్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ కిరణ్‌మయి, డా.సుబ్బా రావు, శంకరయ్య, లెప్టినెంట్ తిరుపతి, డా.శార ద, డా. రామకృష్ణ, డా.అజయ్‌కుమార్‌తో పాటు అధ్యాపక బృందం పాల్గొన్నారు.