Share News

పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధి

ABN , Publish Date - Aug 31 , 2025 | 12:33 AM

పార్టీలకతీ తంగా నిరంతరం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నా రు. శనివారం ఉప్పరపల్లి, గోపరపల్లి, హరిపురం, కొలనూరు గ్రామాల్లో రూ.2.55 కోట్ల నిధుల తో డ్రైనేజీలు, సీసీరోడ్లకు, స్కూల్‌ ప్రహరీ నిర్మాణా లకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.

పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధి

ఓదెల, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): పార్టీలకతీ తంగా నిరంతరం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నా రు. శనివారం ఉప్పరపల్లి, గోపరపల్లి, హరిపురం, కొలనూరు గ్రామాల్లో రూ.2.55 కోట్ల నిధుల తో డ్రైనేజీలు, సీసీరోడ్లకు, స్కూల్‌ ప్రహరీ నిర్మాణా లకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతు కోట్ల రూపాయలు వెచ్చించి గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోను కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రజాప్రతి నిధులను ఎన్నుకుంటే అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముందుకు తీసుకువెళ్లే వీలుంటుం దన్నారు.

ఈ గ్రామాల్లో పూర్తి స్థాయిలో సిసీ రోడ్లను నిర్మించనున్నట్లు తెలిపారు. హరిపురం లో యాదవులు గొంగళి, నాగలి అందజేసి ఎమ్మె ల్యేను స్వాగతించారు. మార్కెట్‌ చైర్‌పర్సన్‌ ఈర్ల స్వరూప, ఎంపిడిఓ తిరుపతి, ఎంపీ వో షబ్బీర్‌, పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్‌ సాగర్‌ రెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ ఆళ్ల సుమన్‌ రెడ్డి, ఆలయ ఛైర్మన్‌ చీకట్ల మొండయ్య, విజయేందర్‌ రెడ్డి, మాజీ సింగిల్‌ విండో చైర్మన్‌ గోపు నారాయణ రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బైరి రవి గౌడ్‌, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌, గుండేటి మధు, మాజీ సర్పంచులు పడాల రాజు, డిల్లి శంకర్‌,బొంగోని రాజయ్య, కుంచం మల్లయ్య, పుప్యాల శంకర్‌, పాకాల కర్ణాకర్‌, రజినికాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2025 | 12:33 AM