Share News

నేటి నుంచి కొత్త మద్యం షాపులు...

ABN , Publish Date - Nov 30 , 2025 | 11:59 PM

జిల్లాలో నేటి నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం ఈ మేరకు వ్యాపారులకు లైసెన్స్‌లు జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా 75మద్యం షాపులు ప్రారంభించను న్నారు. రామగుండం నగరపాలక సంస్థతో పాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ మున్సి పాలిటీలు, వివిధ మండలాల్లో కొత్త షాపులు ఏర్పాటు కానున్నాయి.

నేటి నుంచి కొత్త మద్యం షాపులు...

కోల్‌సిటీ, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నేటి నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం ఈ మేరకు వ్యాపారులకు లైసెన్స్‌లు జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా 75మద్యం షాపులు ప్రారంభించను న్నారు. రామగుండం నగరపాలక సంస్థతో పాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ మున్సి పాలిటీలు, వివిధ మండలాల్లో కొత్త షాపులు ఏర్పాటు కానున్నాయి. రామగుండం ఎక్సైజ్‌ పరిధిలో 24మద్యం షాపులు ఏర్పాటు కాను న్నాయి. ఇందులో రామగుండం అర్బన్‌లో 20, అంతర్గాంలో ఒకటి, పాలకుర్తి మండలంలో మూడు షాపులు ఏర్పాటు చేయనున్నారు. ఈ సారి ఎక్సైజ్‌ పాలసీలో మార్పులు చేయడంతో వ్యాపారులకు అడ్డాల సమస్య తలెత్తింది. మున్సిపాలిటీ పరిధిలో లైసెన్స్‌ ఎక్కడ వచ్చినా ఆ మున్సిపల్‌ ఏరియాలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించారు. రామగుం డంలో రెండు క్లస్టర్లు ఏర్పాటు చేశారు. కార్పొ రేషన్‌లో గిరాకీలు తక్కువ ఉన్నాయంటూ మూడు షాపులను హైదరాబాద్‌కు మార్చారు. అందులో యైుటింక్లయిన్‌కాలనీ, గోదావరిఖని షాపులు ఉన్నాయి. కానీ యైుటింక్లయిన్‌ క్లస్టర్‌ లోనే గతం మూడు షాపులు ఉంటే ఇప్పుడు నాలుగు షాపులు ఏర్పాటు చేశారు. ఎన్‌టీపీ సీలో నాలుగు షాపులకు గాను ఐదు షాపులు ఏర్పాటు చేశారు. రోడ్లు, కూడళ్ల విస్తరణను దృష్టిలో ఉంచుకుని ఎక్సైజ్‌శాఖ పలు ప్రాంతాల్లో షాపులు ఏర్పాటు చేయవద్దని సూచించింది. కానీ వ్యాపారులు రిస్క్‌ తమదేనంటూ లేఖలు ఇచ్చి మరీ ఆ అడ్డాలలో షాపులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సారి షాపులు కూడా పెద్ద ఎత్తున చేతులు మారాయి. ఒక్కో షాపునకు లైసెన్స్‌ వచ్చిన వ్యాపారులు పలువురు షాపులు అమ్మారు. ఒక్క రామగుండంలోనే ఐదు షాపులు అమ్ముడయ్యాయి. రూ.52లక్షల నుంచి రూ.65లక్షల రేట్లపై షాపులు అమ్మకాలు జరిగి నట్టు తెలుస్తుంది. ఈ సారి వ్యాపారం లాభదా యకంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి సర్పంచ్‌, అర్బన్‌కు సంబంధించి మున్సిపల్‌ ఎన్నికలు, సమ్మక్క జాతర కలిసి వస్తాయని భావిస్తున్నారు.

Updated Date - Nov 30 , 2025 | 11:59 PM