Share News

ఎన్‌టీపీసీలో నూతన ఆవిష్కరణలు

ABN , Publish Date - Nov 15 , 2025 | 12:22 AM

రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో త్వరలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఈడీ చందన్‌కుమార్‌ సామంత అన్నారు. 48వ ఎన్టీపీసీ ఆవిర్భావ వేడుకలు సందర్భంగా ఏటీఎం బిల్డింగ్‌ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు.

ఎన్‌టీపీసీలో నూతన ఆవిష్కరణలు

జ్యోతినగర్‌, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో త్వరలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఈడీ చందన్‌కుమార్‌ సామంత అన్నారు. 48వ ఎన్టీపీసీ ఆవిర్భావ వేడుకలు సందర్భంగా ఏటీఎం బిల్డింగ్‌ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఎన్టీపీసీ ప్రాజెక్టు ఆవరణలో త్వరలో వంద మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ నిర్వహించనున్నట్లు తెలిపారు. దీని వల్ల భవిష్యత్‌లో విద్యుత్‌ రంగం కీలకం కానున్నదన్నారు. అలాగే కార్బొనేటెడ్‌ బ్రిక్స్‌ ప్లాంటును ఎన్టీపీసీలో నిర్మించనున్నట్లు తెలిపారు. 48 ఏళ్లుగా ఎన్టీపీసీ దక్షిణాదికి వెలుగులను అందిస్తోందని, ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికీ మిగతా ప్రాజెక్టులకు పోటీగా నిలుస్తుందన్నారు. దేశంలో సౌర విద్యుత్‌ స్థాపిత సామర్ధ్యం పెరిగిన నేపథ్యంలో ఽథర్మల్‌ విద్యుత్‌ డిమాండ్‌ తగ్గిందని, రామగుండం ఎన్టీపీసీలో సైతం విద్యుత్‌ ఉత్పత్తిని కుదించాల్సి వచ్చిందన్నారు. ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో సీఎస్‌ఆర్‌ పథకం ద్వారా ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌ సహకారంతో ఈ ప్రాంతంలో మౌళిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు.

ఘనంగా రేజింగ్‌ డే వేడుకలు...

రామగుండం ప్రాజెక్టు రేజింగ్‌ డే సందర్భంగా శుక్రవారం ఉత్సవాలను నిర్వహించారు. ఎడిఎం బిల్డింగ్‌ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో చందన్‌ కుమార్‌ పాల్గొని ఎన్టీపీసీ జెండాను ఆవిష్కరించి కేక్‌ కట్‌ చేశారు. పలు పోటీలలో విజేతలకు ఈడీ, ఇతర అధికారులు బహుమతులను అందించారు. వివిధ విభాగాల జనరల్‌ మేనేజర్లు, హెచ్‌ఓడీలు, ఈజీఎం, హెచ్‌ఆర్‌ విజయ్‌ కుమార్‌ సిగ్దర్‌, సీఐఎస్‌ఎఫ్‌ డిప్యూటీ కమాండెంట్‌ శాస్ర్తి, ఉద్యోగులు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2025 | 12:22 AM