ఓసీపీ-3లో నూతన గ్రేడర్లు ప్రారంభం
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:56 AM
ఓసీపీ-3 ప్రాజెక్టులో నూతనంగా కొనుగోలు చేసిన రెండు మోటార్ గ్రేడర్లను గురువారం జీఎం బండి వెంకటయ్య ప్రారంభించారు. బేస్‌వర్క్‌షాప్‌లో రెండు యంత్రాలకు పూజలు చేసిన అనంతరం వినియోగంలోకి తెచ్చారు.
యైుటింక్లయిన్‌కాలనీ, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): ఓసీపీ-3 ప్రాజెక్టులో నూతనంగా కొనుగోలు చేసిన రెండు మోటార్ గ్రేడర్లను గురువారం జీఎం బండి వెంకటయ్య ప్రారంభించారు. బేస్‌వర్క్‌షాప్‌లో రెండు యంత్రాలకు పూజలు చేసిన అనంతరం వినియోగంలోకి తెచ్చారు. ప్రాజెక్టు అవసరాల దృష్ట్యా కొనుగోలు చేసిన గ్రేడర్లతో వేగవంతంగా రోడ్ల నిర్మాణం, సైడ్ వాలింగ్ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. యంత్రాలు ఎంతటి సామర్థ్యం కలిగి ఉన్నా వినియోగించడం, నిర్వహణలపై వాటి పనితీరు ఆధారపడి ఉంటుందని జీఎం అన్నారు. సరైన శిక్షణ, ప్రివెంట్ మెయింటనెన్స్, బాధ్యతాయుతమైన ఆపరేషన్ ద్వారా మాత్రమే ప్రమాదాలను నివారించవచ్చని జీఎం పేర్కొన్నారు. యంత్రాల సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఆర్జీ రీజియన్ క్వాలిటీ జీఎం సుజాయ్ మజుందార్, ఏఐటీయూసీ బ్రాంచి సెక్రెటరీ జిగురు రవీందర్, ఎస్వోటూ జీఎం రాముడు, పీఓ ఉదయ్‌హరిజన్, మేనేజర్ భరత్‌కుమార్, పీఈ రాజాజీ, హెచ్‌ఓడీ రాజశేఖర్‌తో పాటు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.