Share News

జాతీయ రహదారి పనులు వేగవంతం చేయాలి

ABN , Publish Date - May 06 , 2025 | 11:56 PM

వరంగల్‌-మంచిర్యాల జాతీయ రహ దారి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. మండలం లోని వెంపాడులో జరుగుతున్న జాతీయ రహదారి పనులు, పుట్టపాక, స్థానిక వ్యవ సాయ మార్కెట్‌ యార్డులో, ఏక్లాస్‌పూర్‌ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను, మంథని పట్టణంలోని పాత పాల కేంద్రంలో కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పా టు పనులను కలెక్టర్‌ మంగళవారం పరిశీ లించారు.

జాతీయ రహదారి పనులు వేగవంతం చేయాలి

మంథని/మంథనిరూరల్‌, మే 6 (ఆంధ్ర జ్యోతి): వరంగల్‌-మంచిర్యాల జాతీయ రహ దారి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. మండలం లోని వెంపాడులో జరుగుతున్న జాతీయ రహదారి పనులు, పుట్టపాక, స్థానిక వ్యవ సాయ మార్కెట్‌ యార్డులో, ఏక్లాస్‌పూర్‌ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను, మంథని పట్టణంలోని పాత పాల కేంద్రంలో కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పా టు పనులను కలెక్టర్‌ మంగళవారం పరిశీ లించారు. ఆయన మాట్లాడుతూ.. యాసంగి పంట సీజన్‌లో రైతులు పండించిన నాణ్య మైన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరుగుతుందని, కొనుగోలు కేం ద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. తేమ ప్రమాణాలు రాగానే కొనుగోలు చేస్తున్నామని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని సత్వరమే కేటాయించిన రైస్‌మిల్లు లకు తరలించేలా ఏర్పాటు చేశామన్నారు. మంథని పట్టణ ప్రాంతంలో మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ సెంటర్‌ 3 రోజులలో అందుబాటులోకి తీసుకురావాలన్నారు. జిల్లా సహకార అధికారి శ్రీమాల, మున్సిపల్‌ కమి షనర్‌ మనోహర్‌, మంథని, రామగరి తహసీ ల్దార్లు కుమారస్వామి, సుమన్‌, ఏడిఎం అంజని, అశోక్‌, పద్మ, మౌనిక, పాల్గొన్నారు.

రామగిరి, (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆదివారంపేట్‌ గ్రామంలో జరుగుతున్న జాతీ య రహదారి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారు లకు సూచించారు. మంగళవారం మండలం లోని ఆదివారంపేట్‌ గ్రామంలో నిర్వహించే రహదారి పనుల పురోగతిని పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధి కారులను ఆదేశించారు. తహసీల్దార్‌ సుమన్‌, ఏడిఎం అంజని, ఆర్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 11:56 PM