Share News

నేషనల్‌ హైవే భూ సేకరణ సమస్యలను పరిష్కరించాలి

ABN , Publish Date - Oct 16 , 2025 | 11:46 PM

నేషనల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనులకు సంబంధించి భూ సేకరణ సమస్యలను ఈనెల 24లోపు పరిష్కరించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఆర్డీవో, మున్సిపల్‌ కార్యాలయాల్లో పలు అభివృద్ధి పనుల పై వివిధ శాఖల అధికారులతో గురువారం సమీక్షించారు.

నేషనల్‌ హైవే భూ సేకరణ సమస్యలను పరిష్కరించాలి

మంథని, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): నేషనల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనులకు సంబంధించి భూ సేకరణ సమస్యలను ఈనెల 24లోపు పరిష్కరించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఆర్డీవో, మున్సిపల్‌ కార్యాలయాల్లో పలు అభివృద్ధి పనుల పై వివిధ శాఖల అధికారులతో గురువారం సమీక్షించారు. అనంతరం మహిళా కుట్ట మిషన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను కలెక్టర్‌ శ్రీహర్ష ప్రారం భించారు. ప్రభుత్వ సంగీత కళాశాలను, డే కేర్‌ సెంటర్‌ను సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంథని పట్టణంలో చేపట్టిన అం తర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణాలు, స్ర్టీట్‌ లైట్ల ఏర్పాట్లు లాంటి అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. కూరగాయల మార్కెట్‌ నిర్మాణ పనులు వేగవంతం చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాల న్నారు.

మంచిర్యాల-వరంగల్‌ నేషనల్‌ గ్రీన్‌ఫీల్డు హైవేకు సంబంధించి జిల్లా లో భూ బదలాయింపు చివరి దశకు చేరుకుందన్నారు. భూసేకరణ, పరి హారం చెల్లింపు పనులు ఈనెల 24వ తేదీలోపు పరిష్కరించాలని ఆదేశిం చారు. ఈనెల 30 లోపు మంథని, ముత్తారం, రామగిరి మండలాల్లో హైవే గ్రావెల్‌ పనులు పూర్తి చేయాలన్నారు. టైలరింగ్‌లో మహిళలు శిక్షణ పాంది స్వయం ఉపాధి పొందాలన్నారు. వయోవృద్ధులకు అనుకూలంగా ఉండేలా వారంలో లోగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్‌డీవో సురేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మనోహర్‌, ఎన్‌హెచ్‌ పీడీ కీర్తి భరద్వాజ, మెగా ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Oct 16 , 2025 | 11:46 PM