Share News

పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలి

ABN , Publish Date - May 18 , 2025 | 12:01 AM

విద్యార్థులు, ఉపాధ్యాయులు పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత అన్నారు. పెద్దపల్లి బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో జడ్జి మాట్లాడారు.

పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలి

పెద్దపల్లి టౌన్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు, ఉపాధ్యాయులు పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత అన్నారు. పెద్దపల్లి బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో జడ్జి మాట్లాడారు. పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిది ద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. బాలికలు, బాలురు అనే తేడా లేకుండా చట్టంపై అవగాహన కలిగి ఉంటే నేరాలు జరగకుండా నివారించవచ్చన్నారు. పిల్లలకు జరిగే అన్యాయాలను తల్లిదండ్రులు సంయ మనంతో వ్యవహరించి వివరాలు సేకరించాలని సూచించారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను, చట్టాలపై అవగాహన కల్పించారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి స్వప్నరాణి, ప్రధానోపాధ్యాయులు అరుణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2025 | 12:01 AM