ముదిరాజ్ మహాసభను విజయవంతం చేయాలి
ABN , Publish Date - Sep 09 , 2025 | 12:15 AM
కాంగ్రెస్ పార్టీ అధికా రంలోకి రావడంలో ముదిరాజ్‌లు కీలక పాత్ర పోషించారని, గద్దెనె క్కిన తర్వాత తమను పట్టించుకో వడం లేదని తెలంగాణ ముది రాజ్ పోరాట సమితి జిల్లా నాయ కులు, మాజీ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 10న కరీంనగర్‌లో ముదిరాజ్‌ల డిమాండ్ల సాధన కోసం నిర్వహించే బహిరంగ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
పెద్దపల్లి, సెప్టెంబరు 8 (ఆం ధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ అధికా రంలోకి రావడంలో ముదిరాజ్‌లు కీలక పాత్ర పోషించారని, గద్దెనె క్కిన తర్వాత తమను పట్టించుకో వడం లేదని తెలంగాణ ముది రాజ్ పోరాట సమితి జిల్లా నాయ కులు, మాజీ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 10న కరీంనగర్‌లో ముదిరాజ్‌ల డిమాండ్ల సాధన కోసం నిర్వహించే బహిరంగ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజ్యాధికారంలో తమ వాటా ప్రకారం సీట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మో సం చేస్తున్నదని, ఒక్క ముదిరాజ్‌కు కూడా ఎంపీ సీటు ఇవ్వలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సీట్లు కేటాయించాలని డిమాం డ్ చేశారు.
ముదిరాజ్‌లను బీసీ-డి నుంచి బీసీ-ఏలో చేర్చాలని, 57 సంవత్సరాలు నిండిన ప్రతి మత్స్యకారుడికి నెలకు 5 వేల పింఛన్ ఇవ్వాలని, 18 ఏళ్లు నిండిన వారికి మత్స్య సహకార సంఘాల్లో సభ్యత్వం ఇవ్వాలని, ఉచిత చేప పిల్లలకు బదులు నగదు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 10న కరీంనగర్‌లో జరిగే సభకు పెద్ద ఎత్తున ముదిరాజ్ కులస్తులు హాజరై సత్తా చాటాలని పిలుపునిచ్చారు. జిల్లా మత్స్య సహకార సంఘం చైర్మన్ కొలిపాక నర్సయ్య, టీఎంపీఎస్ రాష్ట్ర నాయకులు సుంకరబోయిన మహేష్, కాశబోయిన శేఖర్, జోగ రవి, తలారి రవి, తదితరులు పాల్గొన్నారు.