Huzurabad Monkey Menace: 'కోతులు బాబోయ్' అంటూ ఆ ఊరి ప్రజల గగ్గోలు.. ఎక్కడంటే.?
ABN , Publish Date - Dec 06 , 2025 | 07:12 AM
హుజూరాబాద్‌లో కోతుల బెడద నానాటికీ పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోకి చొరబడి సామాగ్రిని పాడుచేస్తున్నాయని స్థానికులు వాపోతున్నా.. అధికారులు చర్యలు చేపట్టడం లేదని విమర్శిస్తున్నారు.
హుజూరాబాద్, డిసెంబరు 06: హుజూరాబాద్(Huzurabad) పట్టణంలో కోతుల బెడద రోజురోజుకూ పెరిగిపోతోంది(Monkey Menace). దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కోతులు గుంపులు గుంపులుగా సంచరిస్తుండటంతో బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. హుజూరాబాద్ పట్టణంలో కోతుల బెడద ఉన్నప్పటికీ.. మున్సిపల్, అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి. కోతులు ఇళ్లలోకి చొరబడి సామగ్రిని పాడు చేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఎవరైనా వారించడానికి సాహసం చేస్తే మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి(Monkeys Attack).
మధ్యలో తగ్గినా..
హుజూరాబాద్ పట్టణ శివారులోని రంగనాయకుల, బోర్నపల్లి, రంగాపూర్, రాంపూర్, సిర్సపల్లి గ్రామాల్లో గుట్టలు ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం గ్రానైట్, క్రషర్ వ్యాపారులకు లీజుకిచ్చారు. లీజుకు తీసుకున్న వ్యాపారులు బండను తొలిచేందుకు బాంబులు పెట్టడంతో భయపడి కోతులన్నీ గ్రామాలు, పట్టణాల్లోకి చేరాయి. పట్టణంలోని విద్యానగర్, గాంధీనగర్, కాకతీయకాలనీ, కిందివాడ, మామిండ్లవాడ.. ఇలా ఏ కాలనీలో చూసినా కోతుల సంచారం అధికంగా ఉంది. సుమారు నాలుగేళ్ల క్రితం మున్సిపల్ అధికారులు పట్టణంలో కోతులు పట్టించారు. కొంతకాలం పాటు వీటి బెడద తగ్గింది. తర్వాత మళ్లీ కోతుల రాక పెరిగింది. రోడ్లపైన వెళ్తున్న వారిని గాయపరుస్తున్నాయి. ఈ విషయంలో మున్సిపల్, అటవీ శాఖల అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.
ఇవీ చదవండి:
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీ.. ఎందుకంటే
నా వ్యాఖ్యలపై అసత్య ప్రచారం చేస్తున్నారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్