Share News

యువత కోసం ఆధునిక క్రీడా పరికరాలు ఏర్పాటు చేస్తా

ABN , Publish Date - Jun 20 , 2025 | 11:41 PM

యువత కోసం సింగరేణి జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఆధునిక క్రీడా పరికరాలను ఏర్పాటు చేయనున్నట్టు ఎమ్మెల్యే మక్కాసింగ్‌ రాజ్‌ఠాకూర్‌ తెలిపారు. శుక్ర వారం స్టేడియంలో వాకర్స్‌ల సమస్యలు, క్రీడాభివృ ద్ధిపై క్రీడాకారులతో చర్చించారు.

యువత కోసం ఆధునిక క్రీడా పరికరాలు ఏర్పాటు చేస్తా

గోదావరిఖని, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): యువత కోసం సింగరేణి జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఆధునిక క్రీడా పరికరాలను ఏర్పాటు చేయనున్నట్టు ఎమ్మెల్యే మక్కాసింగ్‌ రాజ్‌ఠాకూర్‌ తెలిపారు. శుక్ర వారం స్టేడియంలో వాకర్స్‌ల సమస్యలు, క్రీడాభివృ ద్ధిపై క్రీడాకారులతో చర్చించారు. ఆయన మాట్లా డుతూ జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో రూ.2కోట్ల వ్యయంతో సింథటిక్‌ వాకింగ్‌ ట్రాక్‌లను ఏర్పాటు, ప్లడ్‌ లైట్లు, టాయిలెట్స్‌, మహిళలు, వృద్ధుల కోసం ప్రత్యేక వాకింగ్‌ జోన్‌లను ఏర్పాటు చేస్తానన్నారు. త్వరలోనే జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంను మోడ ల్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌గా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పెట్టుకున్నట్టు చెప్పారు. అన్ని రకాల క్రీడలను ఏర్పా టు చేసి క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే విధంగా త్వరలోనే చర్యలు తీసుకుంటానని హామి ఇచ్చారు.

మార్కెట్‌ను సందర్శించిన ఎమ్మెల్యే

కోల్‌సిటీ, (ఆంధ్రజ్యోతి): రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ శుక్రవారం జూనియర్‌ కళాశాల మైదా నంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన హోల్‌సేల్‌ మార్కెట్‌ను సందర్శించారు. హోల్‌సేల్‌ వ్యాపారులు, రైతులతో వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ శివాజీనగర్‌లోని మున్సిపల్‌ మార్కెట్‌లో రూ.1.2కోట్ల టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో పనులు చేపట్టామని, హోల్‌సేల్‌ మార్కెట్‌ షెడ్‌ నిర్మిం చడం వల్ల రైతులకు, వ్యాపారులకు ప్రయోజనక రంగా ఉంటుందన్నారు. కూరగాయాలు, మాంసం, చేపల దుకాణాలను ఆధునీకరించి కొనుగోలుకు వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా చేయనున్నామన్నారు. కూరగాయలు తీసుకు వచ్చే రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మున్సి పల్‌ ఇంజనీర్లను పనుల గురించి వాకబు చేశారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

జ్యోతినగర్‌, (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మె ల్యే మక్కాన్‌సింగ్‌ అన్నారు. కార్పొ రేషన్‌ పరిధిలోని 3, 4, 5 పరిధి లో సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకు స్థాపన చేసిన అనంత రం మాట్లాడారు. ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీ లను పూర్తి చేస్తున్నామన్నారు. డివిజన్ల పరి ధిలో సరైన రోడ్డు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడ్డార న్నారు. మంత్రి శ్రీధర్‌బాబు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహకారంతో రామ గుండం నియోజకవ ర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. తెలంగాణ సూపర్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం రెండో దశ 2400 మెగావాట్ల ప్రాజెక్టు ఏర్పా టుకు కృషి చేశానన్నారు. రామగుండం బి పవర్‌హౌ జ్‌ స్థానంలో మరో 800 మెగావాట్ల ప్రాజెక్టును నెల కొల్పుతామని, మేడిపల్లి ఓసీపీ 4లో విద్యుత్‌ ప్రాజె క్ట్‌ను స్థాపిస్తామన్నారు. 2 కోట్లతో ఎస్‌బీఐ బ్యాంకు నర్ర శాలపల్లి, మల్కాపూర్‌, జంగాలపల్లి సీసీ రోడ్డు నిర్మా ణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఆసీఫ్‌ పాషా, ఎం.డి.రహీం, మాచిడి మహేందర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2025 | 11:41 PM