రామగుండంలో ఆధునిక నాలాలు
ABN , Publish Date - Nov 11 , 2025 | 11:41 PM
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో నాలాలను ఆధునిక పద్ధ తిలో నిర్మిస్తున్నారు. నాలాల్లో చెత్త వేయకుండా నాలాల పైకప్పు పెన్సింగ్ వేస్తున్నారు. నగరపాలక సంస్థ పరిధి లో ఆధునికీకరిస్తున్న అన్నీ ప్రధాన నాలాల్లో ఇదే విధా నాన్ని కొనసాగిస్తున్నారు.
కోల్‌సిటీ, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో నాలాలను ఆధునిక పద్ధ తిలో నిర్మిస్తున్నారు. నాలాల్లో చెత్త వేయకుండా నాలాల పైకప్పు పెన్సింగ్ వేస్తున్నారు. నగరపాలక సంస్థ పరిధి లో ఆధునికీకరిస్తున్న అన్నీ ప్రధాన నాలాల్లో ఇదే విధా నాన్ని కొనసాగిస్తున్నారు. తద్వారా నాలాల పూడిక తీతకు యేటా రూ.50లక్షలకుపైగా నిధులను ఆదా చేసేందుకు చర్యలు చేపట్టారు. రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో రామగుండం, ఎన్‌టీపీసీ, గోదావరిఖని ప్రాంతాల్లో ప్రధాన నాలాలను ఆధునీకరిస్తున్నారు. సుమారు 50 ఏళ్ల పాటు మన్నికయ్యే విధంగా స్టీల్, కాంక్రీట్‌తో సీసీ డ్రైన్లను నిర్మిస్తున్నారు. గోదావరిఖని ఇందిరానగర్ నుంచి మార్కండేయకాలనీ, జీఎం కాలనీ రాజీవ్ రహ దారి నుంచి ఐబీ కాలనీ మీదుగా మెడికల్ కళాశాల, రాజీవ్ రహదారి నుంచి మెడికల్ కళాశాల మీదుగా సప్తగిరికాలనీ వరకు ఈ డ్రైన్ల నిర్మాణం చేపట్టారు. ఈ డ్రైన్లలో ఇక నుంచి ప్రజలు చెత్త వేయకుండా నివా రించేందుకు డ్రైన్ల పైకప్పునకు పెన్సింగ్ వేస్తున్నారు. ఇందుకు గాను డ్రైన్ల నిర్మాణంలోనే పెనింగ్ వేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.
మొదటి దశలో స్థానిక ఇంది రానగర్‌లోని ఆర్‌ఎఫ్‌సీఐ అవుట్‌లేట్ నుంచి అడ్డగుంట పల్లి ఎఫ్‌సీఐ రోడ్డు వరకు నాలాకు పైకప్పు వేస్తున్నారు. ఇప్పటికే ఫ్యాబ్రికేషన్ పూర్తి చేసి రెండు రోజులుగా పెన్సింగ్ వేస్తున్నారు. ఈ విధానం ద్వారా డ్రైన్‌లలో చెత్త, ప్లాస్టిక్ కవర్లు వేయకుండా నివారించడం, డ్రైనేజీ నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడడం, పూడిక తీత అవసరాలు తక్కువగా ఉండే పరిస్థితులు ఉంటాయని కార్పొరేషన్ అధికారులు పేర్కొంటున్నారు. అలాగే గాలి ద్వారా చెత్తచెదారం, కవర్లు పడకుండా నివారించవచ్చు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో గతంలో యేటా నాలాల పూడిక తీతకే రూ.50లక్షల నుంచి రూ.1కోటి వెచ్చించేవారు. ఈ విధానం ద్వారా నాలాలో చెత్త తగ్గడంతో పాటు స్థానికులే చెత్త వేయకుండా అడ్డుకునే అవకాశం ఉంది.