Share News

ఎమ్మెల్సీ పోలింగ్‌ సజావుగా నిర్వహించాలి

ABN , Publish Date - Feb 23 , 2025 | 12:32 AM

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ సజా వుగా జరిగేలా అధికారులు విధులు నిర్వహించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం పెద్దపల్లిలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ స్థానాల ఎన్నికల పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌, సంబంధిత అధికా రులతో పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 27న ఉదయం 8 నుంచి సాయం త్రం 4 గంటల వరకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు.

ఎమ్మెల్సీ పోలింగ్‌ సజావుగా నిర్వహించాలి

పెద్దపల్లి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ సజా వుగా జరిగేలా అధికారులు విధులు నిర్వహించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం పెద్దపల్లిలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ స్థానాల ఎన్నికల పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌, సంబంధిత అధికా రులతో పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 27న ఉదయం 8 నుంచి సాయం త్రం 4 గంటల వరకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్‌ సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా గట్టి నిఘా పెట్టాలని, డబ్బు, మద్యం, ఇతర ఆభరణాలు పరికరాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయకుండా జాగ్రత్త పడాలని, క్షేత్రస్థాయి నుంచి వచ్చే సమాచారంతో ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తూ వీటిని నిరోధించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నిబం ధనలు తప్పకుండా పాటించాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. ఆర్‌డీఓ బి గంగయ్య, సురేష్‌, ఏసీపీ కృష్ణ, సీఐ ప్రవీణ్‌ కుమార్‌, పెద్దపల్లి తహసిల్దార్‌ రాజయ్య, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2025 | 12:32 AM