Share News

ఎమ్మెల్సీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి

ABN , Publish Date - Feb 15 , 2025 | 12:03 AM

ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి స్థానాలకు ఎన్నికలు పార దర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ డి వేణు అన్నారు. ఈనెల 27న జిల్లాలో నిర్వహించనున్న ఎన్ని కల ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. నామి నేషన్లు ఉపసంహరణ ముగిసిన తర్వాత ఉపాధ్యాయ పోటీలో 19 మంది, పట్టభద్రుల స్థానానికి 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు.

ఎమ్మెల్సీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి

పెద్దపల్లి, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి స్థానాలకు ఎన్నికలు పార దర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ డి వేణు అన్నారు. ఈనెల 27న జిల్లాలో నిర్వహించనున్న ఎన్ని కల ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. నామి నేషన్లు ఉపసంహరణ ముగిసిన తర్వాత ఉపాధ్యాయ పోటీలో 19 మంది, పట్టభద్రుల స్థానానికి 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు 14, పట్టభద్రుల ఎన్నిక కోసం 36 పోలింగ్‌ కేంద్రాలను జిల్లాలో ఏర్పాటు చేస్తు న్నామన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఓటర్ల జాబితా ప్రకారం బ్యాలెట్‌ బాక్స్‌లు కేటాయించాలని, అవసరమైన మేర బ్యాలెట్‌ బాక్సులు అందుబాటులోకి ఉంచుకోవాల న్నారు. ఎన్నికల నిర్వహణకు విధులు నిర్వహించే రెవె న్యూ, పోలీసు, ఇతర శాఖ సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాలని, ఓట ర్లను ప్రలోభ పెట్టే విధంగా డబ్బు, మద్యం, ఆభరణాలు పంపిణీ చేయకుండా నిఘా పెట్టాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అవసరమైన మైక్రో అబ్జర్వ ర్లను కేటాయించాలని లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌కు సూచిం చారు. పెద్దపల్లి అమర్‌నగర్‌లో ఉన్న ప్రభుత్వ జూని యర్‌ కళాశాలలో స్ట్రాంగ్‌ రూమ్‌, డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌, రిసెప్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని, అక్కడ అవసర మైన ఏర్పాట్లు చేయాలన్నారు. 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుతుం దన్నారు. పోలింగ్‌ రోజు ప్రతీ రెండు గంటలకు ఒకసారి వివరాలను ప్రకటించాలని అన్నారు. రెవెన్యూ డివిజన్‌ అధికారి సురేష్‌, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ వెంకటేష్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి, జిల్లా అటవీ అధి కారి శివయ్య, సూపరింటెండెంట్‌ ప్రకాష్‌, రవాణా శాఖ అధికారి రంగారావు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 12:03 AM