Share News

రామగుండంలో నియంతలా ప్రవర్తిస్తున్న ఎమ్మెల్యే

ABN , Publish Date - Sep 16 , 2025 | 12:49 AM

రామగుండంలో ఎమ్మెల్యే మాక్కాన్‌సింగ్‌ ఓ నియంతలా వ్యవహరిస్తున్నాడని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని, మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ అన్నారు. సోమవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చారు.

రామగుండంలో నియంతలా ప్రవర్తిస్తున్న ఎమ్మెల్యే

పెద్దపల్లి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రామగుండంలో ఎమ్మెల్యే మాక్కాన్‌సింగ్‌ ఓ నియంతలా వ్యవహరిస్తున్నాడని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని, మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ అన్నారు. సోమవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ లక్ష్మీనగర్‌లో వ్యాపారులను బెదిరింపులకు గురి చేస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన బంద్‌ను విఫలం చేసేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అభివృద్ధి పేరిట చిరు వ్యాపారుల దుకాణాలు కూల్చి వేస్తూ వారి జీవితాలను రోడ్డున పడవేశారని అన్నారు.

దుకాణం దారులకు ఎలాంటి ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని అన్నారు. రోడ్డు వెడల్పు కోసం చేపడుతున్న ప్రణాళికలు ఇక్కడి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ చేపట్టిన బంద్‌లో వ్యాపారులు పాల్గొంటే మరో ఐదు ఫీట్లు భవనాలను తొలగిస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. గాంధీనగర్‌ లక్ష్మినగర్‌, ఎన్టీపీసీలో కుల్చివేసిన దుకాణదారులకు నష్టపరిహారం చెల్లించాలని, వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నాయకులు గోపు అయులయ్య యాదవ్‌, మాజీ కార్పొరేటర్లు గాధం విజయ కల్వచర్ల కృష్ణవేణి, బాదె అంజలి, నాయకులు బోడ్డు రవీందర్‌, బోడ్డుపల్లి శ్రీనివాస్‌, ఆర్శనపల్లి శ్రీనివాస్‌, మేడి సదానందం, నూతి తిరుపతి, మెతుకు దేవరాజ్‌, సట్టు శ్రీనివాస్‌ ముద్దసాని సంధ్యా రెడ్డి, బుర్ర వెంకటేష్‌, వెంకటస్వామి, ఇరుగురాళ్ల శ్రావణ్‌, రాజ్‌ కుమార్‌ చింటూ, కిరణ్‌జీ, రామరాజు, తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 16 , 2025 | 12:49 AM