మంత్రి శ్రీధర్‌బాబును విమర్శిస్తే ఊరుకునేది లేదు
ABN , Publish Date - Oct 26 , 2025 | 11:41 PM
రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అసత్య ఆరోపణలు చేయడాన్ని సహించేది లేదని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలను బీఆర్‌ఎస్ పార్టీ జీర్ణించుకోవడం లేదన్నారు.
గోదావరిఖని, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అసత్య ఆరోపణలు చేయడాన్ని సహించేది లేదని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలను బీఆర్‌ఎస్ పార్టీ జీర్ణించుకోవడం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు బీసీ బిడ్డ అని చెప్పుకోవడం సిగ్గుచేటని, బీసీల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీశాఖ మంత్రి చేస్తున్న కృషి మరువలేనిదన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రేవంత్‌రెడ్డి 42శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పించే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేశారని, ఇప్పుడు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు బీసీలకు రిజర్వేషన్లు కల్పించే యోచనలో ఉన్నాయన్నారు. ఎన్నికల సమయంలో మంత్రులపై అసత్య ఆరోపణలు చేయడానికి కేటీఆర్ కొందరికి ట్రైనింగ్ ఇచ్చారని, బీసీలు ఎదగడానికి శ్రీధర్‌బాబు ప్రయత్నం చేస్తుంటే బీసీ బిడ్డనంటూ పుట్ట మధు తప్పుడు కూతలు కూస్తున్నాడన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు తప్పుడు కూతలు కూస్తే సహించేది లేదని హెచ్చరించారు. నగర అధ్యక్షుడు బొంతల రాజేష్, నాయకులు కాల్వ లింగస్వామి, మహంకాళి స్వామి, మారెల్లి రాజిరెడ్డి, బొమ్మక రాజేష్, దూళికట్ట సతీష్, అశోక్ పాల్గొన్నారు.