Share News

ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడంలో మంత్రి విఫలం

ABN , Publish Date - Sep 20 , 2025 | 12:22 AM

మంథని నియోజకవర్గంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించడంలో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు 22 ఇండ్లు కూడా పూర్తి చేయించ లేకపోయారని విమర్శించారు.

ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడంలో మంత్రి విఫలం

మంథని, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): మంథని నియోజకవర్గంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించడంలో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు 22 ఇండ్లు కూడా పూర్తి చేయించ లేకపోయారని విమర్శించారు. నియోజకవర్గంలో 90 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీల్లోని పేదలకు కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో చైర్మన్‌గా ఉన్న శ్రీధర్‌బాబు ఏనాడు న్యాయం చేయలేదన్నారు. నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేస్తే మంథని లో మాత్రం పైలట్‌ ప్రాజెక్టు గ్రామాలను కలుపుకొని ఇప్పటి వరకు 1400 ఇండ్లు మాత్రమే మంజూరు చేశారన్నారు.

రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గాల్లో కార్పొరేషన్‌ మినహా అన్ని మండలాల్లో మంజూరు చేశారన్నారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా వ్యవస్థను కొనసాగిస్తూ సీఎం రేవంత్‌రెడ్డిలాగా డైవర్షన్‌ పాలిటిక్స్‌కు అలవాటు పడ్డారన్నారు. పేద ఇండ్ల విషయంలో చిత్తశుద్ధి ఉంటే దసరా పండగకు ఇండ్ల మంజూరు ప్రొసిడింగ్‌ పత్రాలను అందజేసి నిర్మాణానికి ముగ్గు పోయాలని డిమాండ్‌ చేశారు. శ్రీధర్‌బాబు తన పై ఎన్ని కుట్రలు చేసిన, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిన చివరి శ్వాస వరకు ప్రజల పక్షానే పోరాడుతూనే ఉంటా అన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు ఏగోళపు శంకర్‌గౌడ్‌, మాచీడి రాజుగౌడ్‌, తగరం శంకర్‌లాల్‌, ఆరెపల్లి కుమార్‌, మంథని లక్ష్మన్‌, కనవేన శ్రీనివాస్‌, ఆకుల రాజబాబు, కాయితీ సమ్మయ్య, ఇర్ఫాన్‌, ఆసీఫ్‌, సత్తయ్యలు పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2025 | 12:22 AM